📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Telugu News: Rain-జమ్మూకాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి..పలువురి ఆచూకి గల్లంతు

Author Icon By Pooja
Updated: August 30, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rain: దేశంపై పలుజిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయిగుండం తీవ్ర తుఫానుగా మారింది. దీంతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లతో పాటు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ వరదల బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. 24 గంటల తేడాలో వరుసగా రెండు క్లౌడ్ బరస్ట్స్(Cloud bursts) లు జమ్ముకాశ్మీరు ముంచెత్తాయి. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ పరిస్థితి చిన్నాభిన్నంగా మారింది. రామ్ బాణ్ జిల్లా వరదల్లో కొట్టుకుపోయింది.

ఇందులో ఇప్పటివరకు ఏడుగురు మరణించగా మరికొందరు గల్లంతయ్యారు. చీనాబ్ నదికి దగ్గర ఉండే జిల్లాలో రామ్ బాణ్ ఒకటి. చీనాబ్ నది..జమ్మూ, శ్రీనగర్లను కలిపే జాతీయ రహదారి – 44పై ఉన్న రాంబన్ జిల్లా పర్వత ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది. విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా చీనాబ్ నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరదలు సంభవిస్తున్నాయి. నదిలోని నీరంతా అక్కడి గ్రామాలను ముంచేస్తోంది. జమ్మూ, కాశ్మీర్లో ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చీనాబ్ నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. రెండుసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించింది. శుక్రవారం బండిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్ ను వరద ముంచెత్తింది. అయితే ఇక్కడ ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు. దోడా జిల్లాలో వరదలు సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనికితోడు జమ్మూకాశ్మీర్ హైవే కొండచరియలు విరిగిపడటం వలన ట్రాఫిక్ నిలిచిపోయింది.

విషాదాన్ని మిగిల్చిన వైష్ణోదేవి యాత్ర

మూడురోజుల క్రితం భారీ వర్షాల కారణంగా వైష్ణోదేవి యాత్ర(Vaishno Devi Yatra) పెను విషాదం మిగిల్చింది. రియాసి జిల్లాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో అక్కడ పెద్ద సంఖ్యలు ప్రజలు మరణించారు. ఈ ఘటన అర్ధకుమారి ప్రాంతానికి సమీపంలో చోటు చేస్కుకుంది. ఇప్పటివరకు 39 మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కేంద్ర పాలిత ప్రాంతం అంతా అల్లకల్లోలంగా తయారయ్యింది. ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అక్కడ కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీలం నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో చాలామంది తాము ఉంటున్న నివాస ప్రాంతాలను వదిలి వెళ్లాల్సి వస్తోంది. మరిరెండుమూడు రోజులు వర్షాలు తప్పవని అధికారులు అంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వైష్ణోదేవి యాత్రలో ఎలాంటి ప్రమాదం జరిగింది?
మూడు రోజుల క్రితం భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో రియాసి జిల్లాలోని అర్ధకుమారి సమీపంలో 39 మంది యాత్రికులు మృతి చెందారు.

ప్రస్తుత వర్షాల ప్రభావం ఎంతకాలం కొనసాగనుంది?
మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు లోతట్టు ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-giorgia-italian-prime-minister-melonis-photos-on-porn-site-big-scandal/international/538214/

BandiporaFloods Google News in Telugu JammuKashmirCloudBurst JammuKashmirFloods JammuKashmirRain Latest News in Telugu Telugu News Today VaishnoDeviTragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.