📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Telugu News: Rahul Gandhi-ఓట్ల దోపిడీ ఆరోపణలపై రాహుల్ గాంధీకి రాజ్‌ఠాకరే మద్దతు

Author Icon By Pooja
Updated: August 24, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rahul Gandhi: దేశవ్యాప్తంగా ఓట్ల తారుమారు జరుగుతోందని కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ఆరోపణలకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌ఠాకరే మద్దతు పలికారు. తాను చాలా ఏళ్లుగా ఈ అంశంపై పోరాడుతున్నానని, కానీ ప్రతిపక్ష పార్టీలు తన మాట పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పూణేలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, 2016–17లోనే ఈ సమస్యపై తాను ప్రశ్నలు లేవనెత్తినట్లు రాజ్‌ఠాకరే తెలిపారు. అప్పట్లో శరద్ పవార్, సోనియా గాంధీ, మమతా బెనర్జీ వంటి నేతలను కలసి, లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరుగుతుందని సూచించానని చెప్పారు. అయితే, వారు వెనక్కి తగ్గారని ఆయన విమర్శించారు.

Rahul Gandhi-ఓట్ల దోపిడీ ఆరోపణలపై రాహుల్ గాంధీకి రాజ్‌ఠాకరే మద్దతు

ప్రజల ఓట్లు దొంగిలించబడుతున్నాయి

ప్రజలు వేసిన ఓట్లు అభ్యర్థులకు చేరకపోవడం, వాటిని దోచుకోవడం జరుగుతోందని రాజ్‌ఠాకరే(Raj Thackeray) ఆరోపించారు. 2014 నుంచి ఈ లోపభూయిష్ట ఎన్నికల వ్యవస్థను ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నాయని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలను ఉదాహరణగా చూపుతూ, గెలిచిన వారు గానీ, ఓడిన వారు గానీ ఫలితాలను అంగీకరించలేకపోయారని వ్యాఖ్యానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించాలని తన పార్టీ శ్రేణులను ఆయన కోరారు. ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఎన్నికలను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లలో లక్షకుపైగా నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పారు. అయితే, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించి, రాహుల్ ఆధారాలు సమర్పించాలంటూ లేదా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఇప్పటివరకు రాహుల్ స్పందించలేదు.

రాహుల్ గాంధీ ఎన్నికలపై ఏ ఆరోపణలు చేశారు?
దేశవ్యాప్తంగా ఓట్ల దోపిడీ జరుగుతోందని, నకిలీ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

రాజ్‌ఠాకరే ఎలా స్పందించారు?
రాహుల్ ఆరోపణలకు మద్దతు తెలుపుతూ, తాను ఇదే విషయాన్ని చాలా ఏళ్ల క్రితమే లేవనెత్తానని చెప్పారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-flood-flow-continues-to-flow-into-srisailam-dam/andhra-pradesh/535290/

BJP election controversy Fake voter list issue Google News in Telugu Latest News in Telugu Maharashtra politics news Raj Thackeray supports Rahul Gandhi Telugu News Today Voter fraud in India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.