📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Telugu News: Pune-భర్తను బతికించుకునేందుకు భార్య లివర్ దానం.. ఇన్ఫెక్షన్ తో ఇద్దరూ మృతి

Author Icon By Pooja
Updated: August 25, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pune: భార్యాభర్తల అనుబంధాన్ని ఎంత వర్ణించినా తక్కువే. మనసులో మనసై తోడు ఒకరు ఉంటే ఇక ప్రపంచమే స్వర్గసీమ ఆవుతుంది. కష్టాలు, బాధలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని అయితే ఇట్టే జయించవచ్చు. త్యాగం గొప్ప గుణం. గొప్ప మనసున్నవారే చేస్తారు. భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే భార్య అతనిని ఎలాగైనా కాపాడుకోవాలని పరితపించింది. ఆ త్యాగమే ఇద్దరినీ అనంతలోకానికి పంపించింది. మహారాష్ట్రలోని పూణే(Pune)లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Pune-భర్తను బతికించుకునేందుకు భార్య లివర్ దానం.. ఇన్ఫెక్షన్ తో ఇద్దరూ మృతి

 భర్తకు లివర్ దానం చేసిన భార్య

అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన భర్తను ఏవిధంగానైనా కాపాడుకోవాలని భార్య ఆశించింది. అతని పేరు బాపు కోంకర్. ఆయన కాలేయం(Liver) పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో బాపు భార్య కామిని తన కాలేయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రిలో ఈనెల 15న కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది. కామిని శరీరంలోని కాలేయంలో కొంతభాగాన్ని తీసి ఆమె భర్త బాపు శరీరంలో వైద్యులు అమర్చారు.

ఆరోగ్యం విషమించి, ఇద్దరూ మృతి

ఆపరేషన్ తర్వాత బాపు ఆరోగ్యం మరింత విషమించింది. రెండు రోజుల తర్వాత ఈనెల 17న బాపు కన్నుమూశాడు. మరోవైపు, కాలేయ దానం కారణంగా కామినికి కూడా ఇన్ ఫెక్షన్ సోకింది. చికిత్స పొందుతూ ఈనెల 21న ఆమె కూడా మరణించారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాపు, కామిని చని పోయారంటూ వారి బంధువులు ఆందోళన చేపట్టారు. దీనిపై విచారణ జరిపి, వైద్యులను శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు.  స్పందించిన ఉన్నతాధికారులు కాగా ఈ ఘటనపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. కాలేయ మార్పిడి చికిత్సకు సంబంధించిన అన్ని వివరాలు, పేషెంట్ అనారోగ్య వివరాలు, వీడియో ఫుటేజీలతో పాటు రికార్డులన్నీ సమర్పించాలని ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వాటిని పరిశీలించి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

బంధువులు ఏమని ఆరోపించారు?
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఇద్దరూ చనిపోయారని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.

అధికారుల స్పందన ఏమిటి?
ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రికి నోటీసులు జారీ చేసి, రికార్డులు, ఫుటేజ్, వివరాలు అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/kerala-cricket-league-kochi-blue-tigers-thrilling-win/sports/535701/

Breaking News in Telugu Emotional Sacrifice Story Google News in Telugu Husband Wife Death Case Latest News in Telugu Maharashtra Health News Pune Liver Transplant Case Wife Donates Liver to Husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.