📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pak- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్

Author Icon By Pooja
Updated: August 21, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pak: భారతదేశంతో నిత్యం పోరాడేందుకు ప్రయత్నించే పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. భారత్పై యుద్ధానికి దిగిన పాక్ రక్షణ ఆయుధాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నది. దీనికి తోడు సింధునది(Indus River) నీటి విడుదలను భారతదేశం ఆపి వేయడంతో రైతులకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఒకవైపు తీవ్రమైన వర్షాలు మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలు
అల్లాడుతున్నారు. భారత విమానాలను పాక్ గగనతలంపై అనుమతిని ఇవ్వకపోవడంతో విమానాసంస్థలకు ఖర్చు విపరీతంగా పెరిగింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశ జనాభాలో దాదాపు సగం మంది 44.7శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించడం ఆదేశ దయనీయ పరిస్థితులను తెలుపుతున్నది. రాజకీయ, ఆస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి వంటి సమస్యలు దేశాన్ని ఆర్థిక దివాళాతనానికి దారితీస్తున్నది.

Telugu News: Pak- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్

బ్యూరో స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం

పాకిస్తాన్ 2022లో 1,766 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం, 2023 నాటికి 1,568 డాలర్లకు పడిపోయింది. అంటే, ఏడాది కాలంలో 11.38శాతం క్షీణత నమోదైంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా 375 బిలియన్ డాలర్ల నుంచి 341.6 బిలియన్డా లర్లకు తగ్గిపోయింది. అంతేకాదు ప్రజలను ద్రవ్యోల్బణం(Inflation) కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల కొనుగోలు శక్తి దెబ్బతింది. ప్రాంతీయ విబేధాలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచాయి. ప్రపంపబ్యాంకు చేస్తున్న ఆర్థిక సాయం కూడా పాకిస్తాన్ ప్రజల అవసరాల కోసం కాకుండా రక్షణ రంగాలకే కేటాయిస్తున్నది. భారత్-
పాక్ యుద్ధం కూడా పాకిస్తాన్ ఆర్థికంగా కొలుకోకుండా అయ్యింది. దీంతో దాదాపు 44 శాతం మంది పేదరికంలోనే జీవిస్తున్నారు.

పాకిస్తాన్‌లో దారిద్య్రం ఎంతవరకు ఉంది?
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, పాక్ జనాభాలో సుమారు 44.7% ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు.

ప్రాంతీయ విభేదాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతున్నాయి?
పంజాబ్, సింధ్, బలోచిస్తాన్ ప్రాంతాల మధ్య అసమానతలు, రాజకీయ అస్థిరత పాకిస్తాన్‌లో పెట్టుబడులను తగ్గిస్తున్నాయి. ఇది ఆర్థిక క్షీణతకు దారితీస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-pak-pak-airspace-banned-for-indian-flights-till-september-23/national/533875/

Breaking News in Telugu Food and Fuel Prices Pakistan Google News in Telugu Indus Water Dispute Pakistan economic crisis Pakistan inflation crisis Sindh River Water Issue Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.