📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Nepal-ప్రధాని నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

Author Icon By Pooja
Updated: September 9, 2025 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nepal-నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హఠాత్తుగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన యువత ఖాట్మండులోని ప్రధానమంత్రి కేపీ ఓలీ(KP Oli)అధికారిక నివాసానికి నిప్పు పెట్టడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజీనామా చేయాలని ఒత్తిడి పెడుతూ వేలాది మంది యువకులు వీధులలోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

కేపీ ఓలీ రాజీనామా డిమాండ్‌తో ఉద్రిక్తతలు

ప్రధాని తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పార్లమెంట్ పరిసరాల్లో రహదారులను దిగ్బంధించారు. ఆ తరువాత వారు ఓలీ నివాసంలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, భవనానికి నిప్పు పెట్టారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినా ఆగ్రహం తగ్గలేదని స్పష్టమైంది.

ఈ దాడులు ప్రధాని నివాసానికే పరిమితం కాలేదు. దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసం, మాజీ ప్రధానులు పుష్ప కమల్ దహల్ (ప్రచండ), షేర్ బహదూర్ డ్యూబా గృహాలపై కూడా నిరసనకారులు దాడి చేసి నిప్పుపెట్టారు. మంత్రులు, యూఎంఎల్ మరియు నేపాలీ కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలు కూడా దహనమయ్యాయి. అంతేకాకుండా ఖాట్మండులోని(Kathmandu) యూఎంఎల్, నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రధానమంత్రి కేపీ ఓలీ అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు.

https://twitter.com/_savage_ing/status/1965294479092654258?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1965294479092654258%7Ctwgr%5Ede810ec5637055707de0acd3f205805c4507b9d7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F841041%2Fnepal-political-crisis-protesters-torch-pm-olis-residence
https://twitter.com/_savage_ing/status/1965302930942427516?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1965302930942427516%7Ctwgr%5Ede810ec5637055707de0acd3f205805c4507b9d7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F841041%2Fnepal-political-crisis-protesters-torch-pm-olis-residence

నేపాల్‌లో నిరసనలకు కారణం ఏమిటి?
ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు హింసాత్మకంగా మారాయి.

నిరసనకారులు ఎవరిపై దాడి చేశారు?
ప్రధాని నివాసం, అధ్యక్షుడు పౌడెల్ నివాసం, మాజీ ప్రధానులు దహల్, డ్యూబాల గృహాలు, పలువురు నేతల ఇళ్లు మరియు పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-court-orders-trump-to-pay-rs-733-crore-in-defamation-case/international/543918/

Breaking News in Telugu Google News in Telugu Kathmandu News KP Oli Resignation Demand Latest News in Telugu Nepal Parliament Protest Nepal Protests Nepal Violence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.