📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Nepal Conflict- కుప్పకూలుతున్న దక్షిణాసియా రాజకీయాలు

Author Icon By Pooja
Updated: September 10, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nepal Conflict- రెండుసంవత్సరాల క్రితం శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక మాంద్యంతో దేశమొత్తం చిన్నాభిన్నమైంది. కరోనాతో టూరిజం పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు ఆహారానికి కూడా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రజలు పార్లమెంట్, అధ్యక్ష భవనాలకు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున నిరసనజ్వాలలు చెలరేగాయి. దీంతో ప్రభుత్వాలే మారాల్సి వచ్చింది. బంగ్లాదేశ్(Bangladesh) లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఆదేశ యువకులు చేసిన తిరుగుబాటుకు షేక్ హసీనా ఏకంగా దేశాన్ని విడిచి, భారతదేశంలో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు నేపాల్ కూడా ఇదే జరుగుతున్నది.

వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న దక్షిణాసియా రాజకీయాలు

దక్షిణాసియాలో రాజకీయాలు గతకొంతకాలం నుంచి వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశ నాయకులనే మార్చాలంటూ ఉద్యమాలు మిన్నంటుతున్నాయి. మనదేశ పోరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, నేపాల్ వంటి దేశాల్లో ప్రజలు తమ అసంతృప్తిని పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. అవినీతి, నిరుద్యోగం, న్యాయసంబంధ సమస్యలతో పాటు ఇతర సమస్యలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. వీటితో పాటు తాజాగా నేపాల్ లో విధించిన సోషల్ మీడియా(Social Media) నిషేధం కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ దేశాల్లో జరిగిన నిరసనల్లో కొన్ని సాధారణ అంశాలను  గమనించినట్లైతే.. అవినీతి, బంధుప్రీతిని వ్యతిరేకించడం, పేదలకు ఉద్యోగాలు లేకపోవడం, పారదర్శకత, సమానత్వానికి పోరాటం వంటి అంశాలు ఉన్నాయి.

ఉద్యమంతో రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని

2025 సెప్టెంబర్ 9న, నేపాల్ లోని జనరల్ జెడ్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ ఉద్యమం దెబ్బకు ప్రధాని కె.పి.శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో పరిస్థితి సద్దుమణుగుతుందని భావించారు. కానీ పరిస్థితి మరింతగా దిగజారింది. యువకుల నిరసనలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో పోలీసుదళాలు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్లు, ప్రత్యక్ష మందుగుండు సామగ్రి ఉపయోగిస్తూ నిరసనకారులను అణిచివేయాలని ప్రయత్నించినప్పటికి పరిస్థితి అదుపు తప్పడం లేదు. మంగళవారం నిరసనకారులు పార్లమెంటు, ప్రధాని అధికార నివాసాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని అధికార నివాసానికి నిప్పుపెట్టారు. దీంతో వెంటనే ప్రధాని ఓలి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సైన్యం బలవంతంగా ప్రధాని చేత రాజీనామా చేయించారు.

బంగ్లాదేశ్ లో 2024లో భారీ నిరసనలు

గతసంవత్సరం బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమం నడిపారు. ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను చర్చిస్తూ, అవినీతి, బంధుప్రీతిపై అవినీతిపరులైన రాజకీయ నాయకుల సమర్థనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అధికార బంధుప్రీతితో పాలించబడుతుందంటూ వేలాదిమంది ప్రజలు రోడ్డుమీదకు చేరి తమ నిరసనలు వెళ్లగక్కారు. ప్రభుత్వ అధికారాన్ని అణచివేయడం వలన షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. చేసేది లేక ఆమె తన ప్రాణాలను కాపాడుకునేందుకు భారతదేశం ఆశ్రయాన్ని పొందారు.

ఇండోనేషియాలో ఎంపీల వేతనాలపై రగిలిన జ్వాల

ఇండోనేషియాలోని(Indonesia) జకార్తాలో ఎంపీలకు గృహభత్యాలు అత్యధికంగా ఉండటం వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనగా మారారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక రంగాల్లో కోతలు అమలు చేయడం ప్రజల కోపానికి కారణమైంది. ఎంపీలకు గృహభత్యాలు, పెన్షన్లు అధికంగా ఉండటం వ్యతిరేకించి వేలాదిమంది నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. కొన్ని చోట్ల భద్రతా కఠిన చర్యల కారణంగా తీవ్ర హింస జరిగినా కూడా ఉద్యమకారులు తమ నిరసనలు ఆపలేదు.

దక్షిణాసియాలో రాజకీయ అస్థిరత ఎందుకు పెరుగుతోంది?
అవినీతి, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అధికార పార్టీల మధ్య విభేదాలు, విదేశాంగ విధానాల్లో విఫలతలు కారణంగా రాజకీయ అస్థిరత ఎక్కువైంది.

ఈ అస్థిరతపై భారత్‌పై ఏమి ప్రభావం పడుతుంది?
పొరుగు దేశాల్లో కల్లోలం పెరగడం వలన భారత సరిహద్దు భద్రత, వాణిజ్యం, విదేశాంగ సంబంధాలపై ప్రభావం చూపుతుంది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/movie-review-bakasura-restaurant-a-failed-attempt-at-a-horror-comedy-mix/review/544641/

India Neighbours political instability South Asia Crisis South Asia politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.