Indian Railways: భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన రైల్వే నెట్‌వర్క్ కలిగిన దేశం. ప్రతిరోజూ లక్షలాది మంది తక్కువ ఛార్జీలతో, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రైల్వేలను ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలు కొత్త పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రైళ్లలో CCTV కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని ముఖ్య ప్రదేశాల్లో ఆధునిక AI ఆధారిత కెమెరాలను(AI-based cameras) కూడా అమర్చుతున్నారు.
1800 కోచ్‌లలో CCTV ఏర్పాటు
ప్రస్తుతం రైల్వేలు 1800 కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు అమర్చే ప్రక్రియలో ఉన్నాయి. LFPలో నిర్మిస్తున్న 895 కోచ్‌లు, ICFలో తయారవుతున్న 887 కోచ్‌లలో ఈ సదుపాయం కల్పించనున్నారు. మొదటి దశలో ప్రజ్ఞరాజ్, డాక్టర్ అంబేద్కర్ నగర్ ఎక్స్‌ప్రెస్,(Dr. Ambedkar Nagar Express) కాళింది ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్, మీరట్ సిటీ సంగం ఎక్స్‌ప్రెస్, శ్రీమాత వైష్ణో దేవి కాట్రా జమ్మూ మెయిల్ రైళ్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చడం ప్రారంభించారు. ఈ చర్యల ద్వారా రైళ్లలో భద్రత మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు.
మొదటి దశలో ఏ రైళ్లలో కెమెరాలు అమర్చుతున్నారు?
ప్రజ్ఞరాజ్, డాక్టర్ అంబేద్కర్ నగర్ ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్, మీరట్ సిటీ సంగం ఎక్స్‌ప్రెస్, శ్రీమాత వైష్ణో దేవి కాట్రా జమ్మూ మెయిల్.
ఏ కోచ్‌లలో కొత్త సీసీటీవీలు అమర్చబడ్డాయి?
LFPలో నిర్మించిన 895 కోచ్‌లు, ICFలో తయారైన 887 కోచ్‌లు.
Read hindi news : hindi.vaartha.com
Read also: