📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: India-భారత్-పాక్ మధ్యవర్తిత్వంపై ట్రంప్ వాదనల్ని ఖండించిన జైశంకర్

Author Icon By Pooja
Updated: August 23, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిఎస్.జైశంక ర్తీవ్రంగా స్పందించారు. ట్రంప్ పదేపదే తాను రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని, లేకపోతే రెండు దేశాలు అణుయుద్ధాలకు దిగేవని ఇప్పటికే పలుమార్లు చెప్పుకున్నారు. దీనిపై భారత్ తీవ్రంగా ఖండించింది. అయినా ట్రంప్ తన విధానాన్ని మార్చుకోకుండా ఇదే పాట పాడుతున్నారు. తాజాగా మరోసారి ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జశంకర్ (S.Jai Shankar)ఖండించారు. పాకిస్థాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడోదేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

India-భారత్-పాక్ మధ్యవర్తిత్వంపై ట్రంప్ వాదనల్ని ఖండించిన జైశంకర్

ఆయన మాటల్లో నిజం లేదు: జైశంకర్

ఢిల్లీలో జరిగిన ‘కనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ 2025 సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెలలో భారత్-పాక్ మధ్య నాలుగు రోజులపాటు నెలకొన్న ఉద్రిక్తల సమయంలో అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ పదేపదే చెబుతున్న మాటల్లో నిజం లేదని జైశంకర్ పేర్కొన్నారు. పాకిస్థాన్తో మూ సంబంధాల్లో మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోమని 1970ల నుంచి దాదాపు 50ఏళ్లుగా దేశంలో ఒక జాతీయ ఏకాభిప్రాయం ఉంది’ అని ఆయన అన్నారు.

మెరుగు పడుతున్న అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు

దేశ భద్రత, ఆర్థిక సహకారం వంటి రంగాల్లో అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికాలో పర్యటించారు. భారత్ ను అమెరికా నుంచే మునీర్ తీవ్రంగా హెచ్చరించారు. సిందు నది జలాలు ఇవ్వకపోతే భారతదేశంపై అణుదాడులకు దిగుతామని వార్నింగ్(Warning) ఇచ్చారు. రైతుల ప్రయోజనాలు, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, మధ్యవర్తిత్వం వ్యతిరేకత వంటి అంశాల్లో ఈ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉందన్నారు.

రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యం

దేశప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం వైఖరిని కూడా స్పష్టం చేశారు. ‘రైతుల ప్రయోనాలు, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, మధ్యవర్తిత్వం వ్యతిరేకత వంటి అంశాల్లో ఈ ప్రభుత్వం చాలా నిక్కచిగా ఉంది’ అని జైశంకర్ అన్నారు. తమ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారు, ఆ విషయాన్ని భారత ప్రజలకు దైర్యంగా చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి మీరు సిద్ధంగా లేరని ప్రజలకు చెప్పండి. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి మీరు విలువ ఇవ్వరని చెప్పండి. మేం మాత్రం వీటికి కట్టుబడి ఉంటాం’ అని ఆయన స్ట్రాంగ్గా చెప్పారు. ట్రంప్ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ నామినేట్ చేసింది. పాకిస్తాన్- అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నది. ఇది ఒకవిధంగా భారత్ కు కొత్త తలనొప్పులుగా మారింది.

ట్రంప్ ఏమని చెప్పారు?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తాను జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపానని పదేపదే చెప్పారు.

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎలా స్పందించారు?
జైశంకర్, ట్రంప్ వాదనల్లో నిజం లేదని ఖండించారు. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మూడవ దేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/mla-pooja-if-i-am-murdered-akhilesh-yadav-is-responsible/national/535028/

DonaldTrump Google News in Telugu IndiaForeignPolicy IndusWatersDispute Latest News in Telugu SJaishankar Telugu News Today USPakistanTies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.