📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Crime News-కూతురితో కలిసి సజీవదహనానికి పాలుపడ్డ మహిళ

Author Icon By Pooja
Updated: August 26, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Crime News: దేశంలో వరకట్న వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని(Rajasthan) జోధ్‌పూర్‌లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ లెక్చరర్‌గా పనిచేసిన సంజు బిష్ణోయ్ తన చిన్న కుమార్తె యశస్వితో కలిసి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో చిన్నారి యశస్వి అక్కడికక్కడే మృతిచెందగా, సంజు తీవ్ర కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించింది.

ఎలా జరిగింది సంఘటన?
పోలీసుల సమాచారం ప్రకారం, శుక్రవారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సంజు(Sanju) ఇంట్లో తాళం వేసుకుంది. ఇంట్లో లాబీలో కూర్చుని తనపై, తన కుమార్తెపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో చిక్కుకున్న ఇద్దరిలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సంజు మాత్రం ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు తుదిశ్వాస విడిచింది. సంజు తల్లిదండ్రులు ఆమె భర్త దిలీప్ బిష్ణోయ్, అత్తమామలు వరకట్నం కోసం పదే పదే వేధించారని, ఇదే కారణంగా సంజు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. సంఘటన స్థలంలో పోలీసులు పెట్రోల్ డబ్బా స్వాధీనం చేసుకున్నారు.

Crime News: కూతురితో కలిసి సజీవదహనానికి పాలుపడ్డ మహిళ

కుటుంబాల్లో ఉద్రిక్తత
శనివారం మహాత్మా గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సంజు అత్తమామలు మృతదేహాలను తమ కస్టడీకి ఇవ్వాలని పట్టుబట్టగా, మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు.

జోధ్‌పూర్‌లో ఏమి జరిగింది?
వరకట్న వేధింపులను తట్టుకోలేక ప్రభుత్వ లెక్చరర్ సంజు బిష్ణోయ్ తన కుమార్తెతో కలిసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనలో ఎవరు మృతి చెందారు?
చిన్నారి యశస్వి అక్కడికక్కడే మరణించగా, సంజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-suicide-married-woman-kills-child-on-suspicion-of-rabies-then-commits-suicide/telangana/536233/

Dowry Death India Dowry Harassment Google News in Telugu Jodhpur Dowry Case Latest News in Telugu Rajasthan Crime News Sanju Bishnoi Case Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.