Conflict-నేపాల్ లో ఉద్రిక్తతలు.. సరిహద్దులో భారత్ హై అలర్ట్నేపాల్ దేశంలో పరిస్థితి అదుపుతప్పింది. సోషల్ మీడియా(Social Media)పై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆదేశంలో నిరసనల జ్వాలలు రగులుతున్నాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. దేశంలో పరిస్థితులు ఆధ్వానంగా ఉన్నాయి. ఈ ఉదయం నిరసనకారులు ప్రధాని అధికార నివాసభవనానికి నిప్పు పెట్టారు. దీంతో చేసేది లేక ప్రధాని ఓలి తన పదవికి రాజీనామా చేశారు.
అప్రమత్తమైన భారత్
గత మూడురోజులుగా నేపాల్ లో కొనసాగుతున్న నిరసనకారుల ఆందోళనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. భారత్-నేపాల్(India-Nepal) బార్డర్ వద్ద పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ లోని నేపాల్ సరిహద్దు పానిటాంకి వద్ద పోలీసు పోస్టును ఏర్పాటు చేశారు. అక్కడికి అదనపు బలగాలను మోహరించినట్లు ఎస్సీ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. బార్డర్ వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తు పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
నేపాల్ లోని భారతీయులను హెచ్చరించిన ఇండియా
నేపాల్ లో జరుగుతున్న అనిశ్చితి పరిస్థితులను బట్టి అక్కడి భారతీయులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. నేపాల్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. అంతేకాక స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది.
ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నిన్నటి నుంచి నేపాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. నేపాల్లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని ఓ ప్రటకనలో తెలిపింది. ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం నూతన ప్రధానమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా ఈ నిరసనలో 20 పౌరులు మరణించారు, పలువురు గాయపడ్డారు. పార్లమెంట్, ప్రధాని నివాసలను ఆందోళనకారులు టార్గెట్ చేసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చర్యలో భాగంగా ప్రధాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
నేపాల్‌లో ఉద్రిక్తతలకు కారణం ఏమిటి?
ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజాస్వామ్యంపై ముప్పు మరియు సోషల్ మీడియా నిషేధం ప్రజల్లో అసంతృప్తి కలిగించాయి.
భారత్ ఎందుకు హై అలర్ట్ ప్రకటించింది?
సరిహద్దు భద్రత కాపాడటం, ప్రజల కదలికలపై నిఘా పెట్టడం, హింసాత్మక పరిణామాలు భారత్‌లోకి వ్యాపించకుండా చూడడం కోసం.
Read hindi news:hindi.vaartha.com
Read also: