Tik Tok: భారతదేశంలో టిక్ టాక్ యాప్(Tik Tok App) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అనేకులు ఈ యాప్ కు బానిసగా మారి, ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు జరిగాయి. చాలామంది టిక్ టాక్ రీల్ మోజ్లో పడి ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2020లో గాల్వన్ లోయల్ భారత్, చైనా సైనికుల మధ్య చెలరేగిన ఉద్రికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతపరమైన కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేసింది. దీంతోపాటు చైనాకు చెందిన అనేక యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నది. బలపడుతున్న సంబంధాలతో టిక్ టాక్పై ప్రచారం అమెరికా టారిఫ్ల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ యాప్ సేవలు మళ్లీ భారత్ లోకి రానున్నాయని ప్రచారం నడుస్తోంది. రెండు దేశాలకు చెందిన నాయకుల మధ్య పలు చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ముందుకొచ్చాయి. దీంతో మళ్లీ భారత్ మార్కెట్లో టిక్ టాక్ యాప్ వస్తుందనే ప్రచారం జోరందుకుంది.
స్పందించిన కేంద్ర ప్రభుత్వం
దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్ లోకి మళ్లీ టిక్ టాక్ వస్తుందన్న ప్రచారాన్ని ఖండించాయి. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాయి. టిక్ టాక్పై దేశంలో ఇంకా నిషేధం కొనసాగుతోందని పేర్కొనాయి. టిక్ టాక్పై నిషేధం ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని తెలిపాయి. ప్రస్తుతం దీనిపై జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్(Fake) అని స్పష్టం చేశాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత భారతీయుల డేటాకు సంబంధించిన తీవ్ర సెక్యూరిటీ ఉల్లంఘనలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది కేంద్రం. ఈ క్రమంలోనే 2020లో 59 చైనా యాప్లపై నిషేధం విధించింది మనదేశం. అనంతరం మరో 118 యాప్లను కూడా కేంద్రం బ్యాన్ చేసింది.
ఈ యాప్ పై కొరఢా ఝళిపించిన కేంద్రం
టిక్ టాక్లతో పాటు హెలో, పబ్ జీ, యూసీ బ్రౌజర్, షేరిట్, బైడు మ్యాప్, క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటి అనేక యాప్లపై భారత్ కొరడా ఝళిపించింది. ఇటీవల రెండు దేశాల మధ్య మెరుగవుతున్న దౌత్యపరమైన సంబంధాలతో మళ్లీ టిక్ టాక్ యాప్ భారత్లో రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో కేంద్రం దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది.
భారత్‌లో టిక్ టాక్ యాప్ ఎప్పుడు బ్యాన్ చేశారు?
2020లో గల్వాన్ లోయలో భారత్–చైనా సైనిక ఘర్షణల అనంతరం, భద్రతా కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను బ్యాన్ చేసింది.
టిక్ టాక్ మళ్లీ భారత్‌లో ప్రారంభమవుతుందా?
ప్రస్తుతం టిక్ టాక్ యాప్‌పై నిషేధం కొనసాగుతూనే ఉంది. దాన్ని ఎత్తివేయాలనే ఎలాంటి ఉత్తర్వులు కేంద్రం నుంచి రాలేదు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :