📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Benguluru-చెప్పులో దూరిన పాము కాటు.. స్పర్శ లేక మరణించిన టెకీ

Author Icon By Pooja
Updated: September 1, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Benguluru: కొన్నిసార్లు చాలా చిన్న ప్రమాదమే అనుకుంటాం. కానీ అదే మన ప్రాణాలను తీస్తుంది. చిన్నపాటి అజాగ్రత్తలే(Carelessness) ప్రాణాలమీదికి తెస్తుంది అనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం. చెప్పులో పాము దూరింది. చూసుకోకుండా ఆ చెప్పుల్ని వేసుకున్నాడు ఓ టెకీ. ఇంకేముందు ఆ పాము అతడిని కాటు వేసింది, అయినా ఆయనకు అదేమీ తెలియలేదు. చివరికి ఏమైందో మీరే చదవండి..

బెంగుళూరులో జరిగిన విషాదం

బెంగళూరులోని టీసీఎస్ కంపెనీలో(TCS Company) పనిచేస్తున్న ప్రకాశ్(41) ఆనేకల్ తాలూకా బన్నేరుఘట్ట సమీపంలోని రంగనాథ లేఅవుట్లో నివసిస్తున్నారు. పనిపై బయటకు వెళ్తూ చెప్పులు వేసుకున్నారు. అందులో ఉన్న పాముపిల్ల అతని బొటనవేలిని కాటేసింది. అతనికి స్పర్శజ్ఞానం లేకపోవడంతో ఆ విషయం తెలియలేదు. కాటు వేశాక సుమారు 45 నిమిషాలు పాము చెప్పులోనే ఉంది. చప్పుల్ని విడిచిన తర్వాత అందులో పాము ఉందని తెలిసింది.

ఆసుపత్రికి తరలించేలోపు మృతి

చెప్పులో పాము ఉందని గ్రహించిన పాము వెంటనే అప్రమత్తమయ్యారు కుటుంబ సభ్యులు. అప్పటికే గంట కావడంతో అస్వస్థతకు గురై మంచం మీద పడ్డ ప్రకాశ్ నోటి నుంచి నురగ వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోగానే మరణించారు. ప్రకాష్కు 2016లో జరిగిన ఓ ప్రమాదంలో కాలి స్పర్శ పూర్తిగా పోయింది. దీంతో తనకు పాము కరిచిన విషయం కూడా తెలియలేదు. బన్నేరుఘట్ట ఠాణా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఏదిఏమైనా వర్షాకాలంలో పాములు తిరుగుతుంటాయి. ప్రత్యేకంగా బయట వదిలే చెప్పులను వేసుకునేముందు కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి. షూష్ వేసుకునేవారికి ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. రాత్రివేళలో పాములు వచ్చి బూట్లలో తిష్టవేస్తాయి. ప్రత్యేకంగా పిల్లలు వేసుకునే షూష విషయంగా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

అతను పాము కాటును ఎందుకు గుర్తించలేకపోయాడు?

ప్రకాష్‌కు 2016లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా కాలి స్పర్శ జ్ఞానం పూర్తిగా పోయింది. అందుకే పాము కరిచినట్లు అతనికి తెలియలేదు.

పాము ఎంతసేపు చెప్పులో ఉంది?

పాము కరిచిన తర్వాత సుమారు 45 నిమిషాల పాటు చెప్పులోనే ఉంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-kaleshwaram-kcr-harish-rao-find-no-relief-in-high-court/telangana/539411/

Breaking News in Telugu Foot numbness Google News in Telugu Latest News in Telugu Monsoon safety Snake bite Techie death Venomous snake

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.