📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Telugu News: Assam-బంగ్లాదేశీయులను తీవ్రంగా హెచ్చరించిన అసోమ్ సిఎం

Author Icon By Pooja
Updated: August 22, 2025 • 2:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Assam: సరిహద్దుల ద్వారా అక్రమంగా అసోమ్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మ(Himanta Biswas Sharma) తీవ్రంగా హెచ్చరించారు. అక్రమ వలసదారులకు చెక్ పెట్టడానికి, బంగ్లాదేశ చొరబాటుదారుల్ని నియంత్రించడానికి అసోమ్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. వారికి ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం ఈ మేరకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అక్టోబర్నుం చి అస్సాంలో 18 ఏళ్ల పైబడిన వారికి ఆధార్ కార్డులు లభించవని సిఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. ఇకపై 18 ఏళ్లకు పైబడ్డ వారెవరికీ ఆధార్ కార్డ్ఇ వ్వకూడదు అని నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీలకు, తేయాకు తోటల్లో పనిచేసే పనివారికి మాత్రం మినహాయింపునిచ్చింది.

Telugu News: Assam-బంగ్లాదేశీయులను తీవ్రంగా హెచ్చరించిన అసోమ్ సిఎం

సరిహద్దు భద్రత కోసం ఈ కఠిన నిర్ణయం

సరిహద్దు భద్రత కోసం, అక్రమ వలసల్ని అడ్డుకోవడం కోసం కఠినంగా వ్యవహరించక తప్పదంటోంది అసోమ్ ప్రభుత్వం. ఇకపై ఏ ఒక్క బంగ్లాదేశీయుడు అసోంలోకి జొరబడి, ఆధార్ కార్డ్ తీసుకుని, మన దేశ పౌరుడిగా చెలామణి కావడానికి వీల్లేదని, తలుపులు మూసివేస్తున్నామని ప్రకటించింది హేమంత్ ప్రభుత్వం. బంగ్లాదేశ్(Bangladesh) నుంచి వచ్చే అవకాశాలను తగ్గించడానికి ముందుజాగ్రత్త చర్యగా సవరించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని నోటిఫికేషన్ కు
అసోం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

నెలరోజుల్లో దరఖాస్తు

మిగతా సామాజిక వర్గాలకు చెందిన అర్హులు ఎవరైనా ఆధార్ కార్డు కావాలనుకుంటే నెలరోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. 18 ఏళ్లు నిండి, ఆధార్ కోసం ఇంతవరకూ రిజిస్టర్ చేసుకోనివాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు సీఎం హిమంత శర్మ. సెప్టెంబర్ తర్వాత ఆధార్ నమోదు అంత ఈజీ కాదని, అత్యవసరమైతే తప్ప ఎన్రోల్ మెంట్ కుదరదని తేల్చేసింది అసోమ్ ప్రభుత్వం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆదేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు దేశంలో జరిగిన అల్లర్లు కారణంగా ఆర్థికంగా ఆదేశం చితికిల పడింది. దీంతో భారతదేశానికి అక్రమంగా వలసలు పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్రమ వలసలు ఆగడం
లేదు.

సెప్టెంబర్ తర్వాత ఆధార్ నమోదు ఎలా ఉంటుంది?
సెప్టెంబర్ తర్వాత ఆధార్ నమోదు చాలా కఠినంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితులు తప్ప సాధారణంగా ఎన్రోల్ మెంట్ కుదరదని అసోమ్ ప్రభుత్వం తెలిపింది.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చే వారి ప్రవేశాన్ని అరికట్టడానికి, వారు ఆధార్ కార్డు తీసుకుని భారత పౌరులుగా మారకుండా నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-earthquake-major-earthquake-in-america-huge-crack-in-antarctic-ice-sheets/international/534383/

Aadhaar Card Restrictions Assam Assam Aadhaar Ban Assam Border Security Breaking News in Telugu Himanta Biswa Sarma Decisions Illegal Immigration in Assam Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.