AkhilaBharata: తెలంగాణ జైళ్లు, సవరణాశాఖ ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్-2025 ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాదులోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర జైళ్లు,(State prisons) సవరణ శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1,300 మందికి పైగా జైలు సిబ్బంది (ఇందులో 184 మంది మహిళలు) పాల్గొని 36 విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారని ఆమె పేర్కొన్నారు.
ప్రత్యేకతలు, పోటీలు, అతిథులు
ఈ కార్యక్రమంలో ప్రథమ చికిత్స, సంక్షేమ పథకాలు, క్విజ్, కంప్యూటర్ నైపుణ్యం వంటి వృత్తి సంబంధిత పోటీలతో పాటు అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, కరాటే, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి క్రీడలు, సాంస్కృతిక పోటీలు కూడా ఉంటాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి కార్యక్రమాన్ని రెండవసారి నిర్వహిస్తోంది. గతంలో 2015లో తొలిసారి నిర్వహించగా, 2022లో అహ్మదాబాద్‌లో జరిగిన 6వ జైలు డ్యూటీ మీట్‌లో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించింది. ఈసారి తొలిసారిగా ఆల్ ఇండియా టెక్నో ఎక్స్‌పో, జైలు ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
సన్నాహక కార్యక్రమంలో భాగంగా డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలంగాణ జట్టు సభ్యులైన 84 మందికి క్రీడా కిట్లను పంపిణీ చేసి, జాతీయ స్థాయిలో క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో(confidence) రాణించాలని ప్రోత్సహించారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్, న్యూఢిల్లీతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 9న ఉదయం 9:30 గంటలకు హిమాయత్ సాగర్‌లోని పోలీస్ అకాడమీలో రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జైలు డ్యూటీ మీట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ తదితరులు పాల్గొంటారని ఆమె చెప్పారు.
జైలు డ్యూటీ మీట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఈ నెల 9 నుండి 11 వరకు హైదరాబాదులోని ఆర్‌బీవీఆర్‌ఆర్ (తెలంగాణ పోలీస్ అకాడమీ)లో జరగనుంది.
ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటారు?
దేశంలోని 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1,300 మందికి పైగా జైలు సిబ్బంది పాల్గొంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: