📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ఉద్యాన పంటలకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహం

Author Icon By Saritha
Updated: February 20, 2026 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: రాష్ట్రంలో ఉద్యాన పంటలను విస్తరణ చేసేందుకు ప్రోత్సాహం కింద రాయితీలను ఆ శాఖ అధికారులు కల్పిస్తున్నారు. ప్రధానంగా సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా పండ్లతో పాటు, పూల తోటల పెంపకానికి ప్రోత్సాహకాల కింద సబ్సిడీ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా వేసే పండ్ల తోటలు బొప్పాయి, అరటి, అల్లనేరడు, సీతాఫలం, మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, పూల సాగుకు 40 శాతం మేర రాయితీ వర్తింపజేయనున్నారు. అదేవిధంగా వంగ, టమాట, పచ్చిమిర్చి, కూరగాయల నారును ఈ పథకం కింద రైతులకు (Farmers) సరఫరా చేయనున్నారు.

Read Also: Hyderabad : కొత్త బాస్లు వీరేనా?

Telangana: State government encourages horticultural crops

పాలీ, గ్రీన్స్లకు 50 శాతం సబ్సిడీ

మామిడి, బత్తాయికి సంబంధించి పాత తోటలు పునర్జీవం కింద 40 శాతం రాయితీ ఇస్తారు. పాలీ గ్రీన్ హౌన నిర్మా ణం, మల్చింగ్ పద్ధతిలో సాగుకు 50శాతం రాయితీ ఇవ్వనుండగా, సమగ్ర తెగులు నివారణకు, సమీకృత పోషణ నిర్వహణకు 50శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఉద్యాన పంటల రైతులకు ట్రాక్టరు, పవర్ టిల్లర్, పవర్ వీడర్, రష్ కట్టర్, స్పెయర్లను కేటాయిస్తారు. ఇక వర్మికంపోస్టు యూనిట్లకు 50శాతం రాయితీ ఇవ్వనున్నారు. పండ్ల తోటలతో పాటు, కూరగాయలకు, మిరప, అయిల్పామ్ సాగుకు బిందు, తుంపర సేద్యాన్ని రాయితీపై పరికరాలు అందించనున్నారు.

పట్టుపురుగుల పెంపకానికి భారీ ప్రోత్సాహకాలు

ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీ, బీసీ, సన్నచిన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు. శాశ్వత పందిరి పద్ధతిలో తీగజాతి కూరగాయల సాగును ప్రోత్సహించనున్నారు. వీటికి కూడా 50శాతం రాయితీ ఇవ్వనున్నారు. అలాగే ఎస్ బీఎం కింద వెదురు మొక్క పెంపకానికి ప్రోత్సాహకం అందించనున్నారు. ఎకరానికి 50శాతం రాయితీపై ర 14,400లు రైతులకు అందజేస్తారు. కాగా మజ్జ సాగు ద్వారా పట్టు పురుగులు ఉత్పత్తి చేసే రైతులు పట్టుగూళ్లకు కిలోకు రూ.75ను ప్రోత్సాహకంగా అంది చనున్నారు. ఎకరానికి రూ.60వేల నుంచి రూ. వేలు, అదేవిధంగా రూ.2.25లక్షల నుంచి రూ.2. లక్షలు రేరింగ్ షెడ్ నిర్మాణంతో పాటు క్రిమిసంహా మందుల సరఫరా, ఉద్యాన యాంత్రీకరణ పరికరాలు 50శాతం రాయితీ ఇవ్వనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Drip Irrigation Subsidy Horticulture Subsidies Latest News in Telugu Polyhouse Subsidy Telangana Sericulture Incentives Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.