బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫలితాల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తోంది. 200కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండడంతో, మరోసారి బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై సందేహం లేకుండా పోయింది. మహాగఠ్‌బంధన్ కూటమి మాత్రం 40కు కూడా చేరుకోలేకపోయింది. ఈ ఎన్నికలను ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, ప్రజలు తమ ఆత్మస్థైర్యాన్ని ఎన్డీయే వైపే చూపించారు.
Read Also: IND vs SA: తొలి టెస్టు .. ఆధిపత్యం ప్రదర్శించిన భారత్
తేజస్వీ ఇచ్చిన హామీలు కూడా ఫలించలేదు
Tejaswi Yadav: మహాగఠ్‌బంధన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక పెద్ద హామీలు ప్రకటించింది. ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ప్రతి వ్యక్తికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా వంటి వాగ్దానాలు చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంపు, రైతులకు కనీస మద్దతు ధర, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ వంటి పథకాలు కూడా ప్రకటించారు.
అయితే ఈ ఎన్నికల్లో ఈ హామీలు బీహార్ ఓటర్లను ఆకర్షించలేకపోయాయి. ప్రజలు తమ ఓట్లను మహాగఠ్‌బంధన్ వైపు మళ్లించలేదు.
ఎన్డీయే హామీలు బీహార్ ప్రజలను కట్టిపడేశాయి
నితీశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయే కూడా అనేక కీలక హామీలు చేసింది. రాష్ట్రంలోని యువతకు ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఒక కోటి మహిళలను “లఖ్‌పతి దీదీ”లుగా తీర్చిదిద్దడం, పేద కుటుంబాలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి వ్యక్తికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా వంటి పథకాలు ప్రకటించింది.
పేదలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్, 50 లక్షల ఇళ్ల నిర్మాణం, గత ఎన్నికల్లో ప్రకటించిన హామీల అమలు వంటి అంశాలు కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాయి.
కేంద్ర ప్రభుత్వ మద్దతు, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అభివృద్ధి జరుగుతుందని ఎన్డీయే నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇవన్నీ కలసి, బీహార్ ప్రజలు ఈసారి కూడా ఎన్డీయే ప్రభుత్వానికే స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: