📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Tejashwi Yadav : ప్రధాని మోదీపై ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్‌ విమర్శలు

Author Icon By Sudha
Updated: July 14, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కు సమయం సమీపించడంతో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష మహా కూటమి పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి.తాజాగా ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ పై ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav) విమర్శలు గుప్పించారు. బీహార్‌లో పరిస్థితులు భయంకరంగా మారుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని తేజస్వి (Tejashwi Yadav)ప్రశ్నించారు. మోదీ తన టెలీ ప్రాంప్టర్‌ను విడిచిపెట్టి మనుసులో మాట చెప్పాలని వ్యాఖ్యానించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ప్రధాని మన్‌ కీ బాత్‌ ప్రోగ్రామ్‌ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు.

Tejashwi Yadav : ప్రధాని మోదీపై ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్‌ విమర్శలు

కేవలం ప్రసంగాలు

బీహార్‌ పరిస్థితి గురించి ప్రధాని మోదీ ఏనాడైనా ఆందోళనగానీ, ఆవేదనగానీ వ్యక్తం చేశారా..? అని తేజస్వి ప్రశ్నించారు. కేవలం ప్రసంగాలు మాత్రమే చేశారని విమర్శించారు. బీహార్‌ ప్రజలతో ఓట్లు వేయించుకున్నప్పుడు వారికి భద్రత కల్పించడం ప్రధాని బాధ్యతా.. కాదా..? అని ఆయన నిలదీశారు. అదేవిధంగా బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రస్తుతం మతిస్థిమితం కోల్పోయి ఉన్నారని, ఆయన ఇప్పుడు బీహార్‌ను పాలించే పరిస్థితి లేదని తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav) వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీయే రిమోట కంట్రోల్‌తో బీహార్‌ను ఆపరేట్‌ చేస్తున్నారని విమర్శించారు. బీహార్‌లో నేర చరిత్ర ఉన్నవాళ్లే చక్రవర్తులు అవుతున్నారని, వాళ్లు ఎన్నికల్లో గెలుస్తున్నారని అన్నారు.

తేజస్వి యాదవ్ ఎవరు?

తేజస్వి ప్రసాద్ యాదవ్ (జననం 9 నవంబర్ 1989) ఒక భారతీయ రాజకీయవేత్త మరియు మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్, అతను బీహార్ ఉప ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేశాడు. ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ మరియు రబ్రీ దేవి ల కుమారుడు.

తేజస్వి యాదవ్ అర్హతలు?

అతను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 6వ తరగతి నుండి చదువుకున్నాడు కానీ చదువు మానేశాడు. అతను 10వ తరగతి పూర్తి చేయలేదు మరియు క్రీడలను కొనసాగించడానికి చదువును ఆపాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు

Bihar Politics Breaking News Indian Politics latest news Modi government PM Modi political criticism Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.