బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. మాహాఘట్బంధన్ (MGB) గెలుస్తుందని, నవంబర్ 18న ప్రమాణస్వీకారం జరుగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. తాము బిహార్ ప్రజల ఆశలను నెరవేర్చే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు.
Read Also: Delhi blast : ఈ నెల 10న ఢిల్లీ వైపు కారును తీసుకెళ్లిన ఉమర్ నబీ

ఎగ్జిట్ పోల్స్‌పై గోడీ మీడియాపై విమర్శలు
తేజస్వీ(Tejashwi Yadav) మాట్లాడుతూ, “కొన్ని మీడియా సంస్థలు అధికారుల ఒత్తిడికి లోనై తప్పుడు ఎగ్జిట్ పోల్స్(Exit polls) విడుదల చేశాయి. కానీ నిజమైన ఫలితాలు మాహాఘట్బంధన్ వైపు ఉంటాయి” అని అన్నారు. గోడీ మీడియా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ఎన్డీఏ పాలనపై ప్రజల అసంతృప్తి
“ఎన్డీఏ పాలనతో ప్రజలు విసిగిపోయారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి పెరిగిపోయాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు,” అని తేజస్వీ పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రంలో అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, సామాజిక న్యాయం తమ ప్రధాన లక్ష్యాలు అని చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన కూటముల మధ్య పోలిటికల్ టెంపరేచర్ పెరిగింది. తేజస్వీ ధీమా ప్రకటనతో ఆర్జేడీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
బీహార్ లో ఏ పార్టీ గెలుస్తుంది? మీ అభిప్రాయం తెలపండి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: