📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest Telugu news : Tejashwi Yadav : ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం.. తేజస్వి యాదవ్‌

Author Icon By Sudha
Updated: October 9, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌ లో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav) బీహార్‌ ప్రజలకు తాజాగా కీలక హామీ ఇచ్చారు. నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఇందుకు సంబందించిన ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించారు.పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తేజస్వి మాట్లాడుతూ (Tejashwi Yadav).. ‘రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం గత 20 ఏళ్లుగా యువతకు ఉపాధి కల్పించలేకపోయింది. మీకు మాటిస్తున్నా.. మేము అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఓ చట్టాన్ని తీసుకొస్తాం. 20 నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం ఉండదు. ప్రతీ కుటుంబంలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు. దీనిపై మేము ఇప్పటికే డేటా సేకరించి సర్వే కూడా నిర్వహించాం.

Tejashwi Yadav : ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం.. తేజస్వి యాదవ్‌


గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలకు నేను హామీ ఇచ్చాను. అప్పుడు అధికారంలో ఉన్న కొద్ది కాలంలోనే దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించా. తక్కువ సమయంలోనే ఇంత చేశానంటే.. నాకు ఐదేళ్ల పదవీకాలం లభిస్తే ఇంకెంత సాధ్యమవుతుందో ఊహించుకోండి’ అని తేజస్వి (Tejashwi Yadav)పేర్కొన్నారు. ఈ సందర్భంగా నితీశ్‌ కుమార్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్‌ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్నారు. ఈ విషయం శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వం గ్రహించలేదు అంటూ వ్యాఖ్యానించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 6న తొలి విడత, నవంబర్‌ 11న రెండో విడత పోలింగ్‌ జరుగుతుందని సీఈసీ వెల్లడించారు. నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 243 స్థానాలు కలిగిన బీహార్‌ అసెంబ్లీకి నవంబర్‌ 22తో గడువు ముగియనుంది.

బీహార్ తేజస్వి యాదవ్ ఎవరు?

తేజస్వి ప్రసాద్ యాదవ్ (జననం 9 నవంబర్ 1989) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్ మరియు ప్రస్తుతం మహాఘట్బంధన్ (బీహార్) ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆయన గతంలో రెండు పర్యాయాలు బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

తేజస్వి అర్హతలు?

బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ నుండి బ్యాచిలర్ ఆఫ్ అకడమిక్ లా మరియు ఎల్ఎల్బీ పట్టా పొందారు. సూర్య కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. 2008 లో, ఆయన అరైజ్ ఇండియా అనే ఎన్జీఓను స్థాపించారు, ఆయన పాఠశాల విద్య కార్యక్రమాలకు అంకితమైన అరైజ్ ఇండియా అనే ఎన్జీఓను కలిగి ఉన్నారు. ఆయన గతంలో ఇండియాఫ్యాక్ట్స్ కోసం రాశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bihar Politics Breaking News Employment Scheme government jobs latest news Political Promise Tejashwi Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.