Latest Telugu news : Tej Pratap – లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్

Read Time:  1 min
Tej Pratap - లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్
Tej Pratap - లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్
FONT SIZE
GET APP

బీహార్‌ మాజీ మంత్రి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap) తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌ను విమర్శించారు. రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో ఆయన అర్థం చేసుకోవాలని అన్నారు. ఆర్జేడీతోపాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap), జనశక్తి జనతాదళ్ అనే సొంత పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్‌ తన అన్నపై పలు ఆరోపణలు చేశారు. ఆయన ఆర్జేడీలో ఉన్నప్పుడు తన సన్నిహితులను రెబల్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దించినట్లు విమర్శించారు.

Tej Pratap - లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్
Tej Pratap – లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్

కాగా, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ దీనిపై స్పందించారు. లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలని సూచించారు. ‘రాముడి విషయంలో లక్ష్మణుడు చేసినట్లుగానే తమ్ముడిగా మర్యాదతో వ్యవహరించాలి
(Be polite) . జైచంద్ లాంటి వ్యక్తులే ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని అన్నారు. మరోవైపు హసన్‌పూర్ ఎమ్మెల్యే అయిన తేజ్‌ ప్రతాప్‌ (Tej Pratap)త్వరలో జరుగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తమ్ముడు తేజస్వీ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘోపూర్ నియోజకవర్గం పక్కనే ఉన్న ఈ స్థానం నుంచి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆయన పోటీ చేశారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ ఎవరు?

తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.

తేజ్ ప్రతాప్ యాదవ్ను ఎందుకు కుటుంబం నుంచి బహిష్కరించారు?

తేజ్ ప్రతాప్‌ బాధ్యతారహితంగా ప్రవర్తించడం, నిజాయితీ & కుటుంబ విలువలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ 25 మే 2025న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుండి ఆరు సంవత్సరాలు బహిష్కరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.