📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Tax rules: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్!

Author Icon By Vanipushpa
Updated: February 10, 2026 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆదాయపు పన్ను శాఖ తన పాత పద్ధతులకు స్వస్తి పలికి, సరికొత్త పన్ను వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ట్యాక్స్ రూల్స్ (Tax rules) అమలులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త మార్పుల ద్వారా పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సరళంగా, పారదర్శకంగా మార్చడమే ప్రధాన ఉద్దేశ్యం అని కేంద్రం అంటోంది. ప్రస్తుతం ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను కోరుతూ ఫిబ్రవరి 22, 2026 వరకు సమయం ఇచ్చింది. ఏంటి ఈ కొత్త ‘స్మార్ట్’ ఫారమ్స్? కొత్త నిబంధనల ప్రకారం, ఐటీ రిటర్న్స్ ఫారమ్‌లను పూర్తిస్థాయిలో రీ-డిజైన్ చేశారు. వీటిని ‘స్మార్ట్ ఫారమ్స్’ గా పిలుస్తున్నారు. వీటిలో ప్రధానమైన మార్పులు ఇవే.. మీ ఆదాయం, పన్ను మినహాయింపులు వంటి వివరాలు చాలా వరకు ఆటోమేటిక్‌ గా ఫారమ్‌లో వచ్చేస్తాయి. దీనివల్ల మీరు పదే పదే ఒకే వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.

Read Also: US: హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న అమెరికా దిగ్గజం కాస్ట్‌కో

Tax rules: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్!

సులభమైన భాష

పన్ను చట్టాల్లో ఉండే కఠినమైన సాంకేతిక పదాలను తొలగించి, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా సరళమైన భాషను ఉపయోగించారు. తప్పులకు తావులేదు: ఆటోమేటెడ్ డేటా మ్యాచింగ్ సిస్టమ్ వల్ల పొరపాట్లు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సామాన్యులకు, ఉద్యోగులకు కలిగే ప్రయోజనం ముఖ్యంగా ఉద్యోగులకు (Salaried individuals) ఈ కొత్త ట్యాక్స్ రూల్స్ (Tax rules) పెద్ద ఊరటనిస్తాయి. గతంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అనేక రకాల ఫారమ్‌లు, అందులో గందరగోళం ఉండేది. కానీ, ఇప్పుడు ఒకే రకమైన స్టాండర్డ్ వివరాలను అన్ని ఫారమ్‌లలో అమలు చేయడం వల్ల రిటర్న్స్ ఫైలింగ్ వేగంగా పూర్తవుతుంది. వ్యాపారవేత్తలకు కూడా ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చే అనవసరమైన నోటీసులు, క్వెరీల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. పాత నిబంధనలకు చరమగీతం డిజిటల్ యుగానికి తగినట్లుగా పాత కాలపు పన్ను నిబంధనలను ప్రభుత్వం తొలగిస్తోంది. ఇప్పుడు మొత్తం వ్యవస్థ టెక్నాలజీ ఆధారంగా పనిచేయబోతోంది. పేపర్ ఫైలింగ్ కంటే ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌ ను ప్రామాణికంగా మార్చారు. పన్ను నిబంధనల్లో స్పష్టత లేకపోవడం వల్ల గతంలో చాలా కేసులు కోర్టుల చుట్టూ తిరిగేవి. కానీ, కొత్త నిబంధనల్లో అస్పష్టతను తొలగించి ప్రతి విషయాన్ని క్లియర్ గా వివరించారు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిబంధనలు ఇంకా తుది నిర్ణయం కాదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

April 1 tax updates Financial Regulations government tax policy income tax changes new tax rules India personal finance news Tax Compliance taxpayer alert Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.