మహిళల ప్రపంచకప్ (Women’s World Cup 2025) లో విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా (TATA) మోటార్స్ ఒక అద్భుతమైన శుభవార్తను ప్రకటించింది. దేశం గర్వపడే ఈ విజయానికి గుర్తుగా, కంపెనీ తమ కొత్త కారు Tata Sierra SUV టాప్ ఎండ్ మోడల్‌ను జట్టులోని ప్రతి సభ్యురాలికి బహుమతిగా అందజేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Read Also: President Draupadi Murmu: రాష్ట్రపతిని కలిసిన మహిళా క్రికెట్ జట్టు
ప్రదర్శన కనబరిచి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది
భారత మహిళా జట్టు ఇటీవల జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ (WWC) ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంతో దేశమంతా ఆనందోత్సాహంలో మునిగిపోయింది. క్రీడాకారిణుల పట్టుదల, శ్రమ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి అందరికీ ప్రేరణగా నిలిచాయి.
ఇదే సందర్భంలో దేశంలో అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ టాటా (TATA) మోటార్స్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.WC విజేతలు & రీఎంట్రీ ఇస్తున్న లెజెండరీ సియెర్రా రెండూ పట్టుదల, ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకలని టాటా మోటార్స్ కొనియాడింది. కాగా ఈ కారు నవంబర్ 25న లాంచ్ కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: