Tamilnadu: డీఎంకే సర్కార్‌పై నటి గౌతమి ఫైర్

Read Time:  1 min
Tamilnadu: డీఎంకే సర్కార్‌పై నటి గౌతమి ఫైర్
FONT SIZE
GET APP

Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా నటి, అన్నాడీఎంకే నేత గౌతమి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆరోపించారు.

Read Also: Ladakh Agitation: లడఖ్ గర్జన: వాంగ్‌చుక్ విడుదల తర్వాత భారీ ర్యాలీ..ఆందోళనలు!

అభద్రతాభావంలో మహిళలు

కోయంబత్తూరులో అన్నాడీఎంకే నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో గౌతమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి స్టాలిన్ హయాంలో రాష్ట్రంలో మహిళలకు సరైన రక్షణ కరువైంది. వారు బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. డీఎంకే ప్రభుత్వం మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది తప్ప, వారి గౌరవం గురించి పట్టించుకోవడం లేదు” అని దుయ్యబట్టారు.

జయలలిత హయామే సువర్ణయుగం

జయలలిత హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని గౌతమి గుర్తుచేశారు. ఆమె తన చివరి శ్వాస వరకు మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నారని, వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. కానీ, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం మాత్రం మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు. మహిళలకు భద్రత, గౌరవం కల్పించడంలో స్టాలిన్ సర్కార్ విఫలమైందని ఆమె దుయ్యబట్టారు.

Tamilnadu: Actress Gautami fires on DMK government
Tamilnadu: Actress Gautami fires on DMK government

విలాతికులం అత్యాచారం, హత్య ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించిన తీరును కూడా గౌతమి తప్పుబట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే మాట్లాడతానని చెప్పడం బాధితురాలి కుటుంబం పట్ల సున్నితత్వం లేకుండా వ్యవహరించడమేనని అన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మహిళల హక్కుల కోసం సుమారు 28 నెలలుగా పోరాడుతున్నారని ప్రశంసించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందని, ఇతర పార్టీల ప్రభావం నామమాత్రమేనని గౌతమి జోస్యం చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.