తమిళనాడు (TamilNadu) లోని విళుప్పురం జిల్లా కందమంగళం సమీపం పకిరిపాళ్యం గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ప్రియాంక (30) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. విద్యార్థులకు పాఠాలు చెబుతూ గౌరవప్రదమైన జీవితం గడుపుతున్న ఆమె జీవితం చివరకు విషాదాంతంగా ముగిసింది. ఈ సంఘటన, గ్రామంతో పాటు ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Also: Sukhwinder Singh Sukhu: హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?
సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో పెడతానని భర్త బెదిరించాడు
ప్రియాంకకు గత ఏడాది అక్టోబర్‌లో (October) పుదుచ్చేరికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. అప్పటినుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం ప్రియాంకను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో పెడతానని భర్త బెదిరించడంతో బుధవారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: