చెన్నై–తిరుచ్చి(TamilNadu Accident) జాతీయ రహదారిపై బుధవారం రాత్రి భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచ్చి నుంచి చెన్నై వెళ్తున్న తమిళనాడు స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (SETC) బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Karnataka Bus Accident: కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..
కడలూరు జిల్లా ఎళుత్తూరు సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు ముందు టైరు ఒక్కసారిగా పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు సెంట్రల్ డివైడర్‌ను ఢీకొట్టి అవతలి లైన్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లను బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
కార్లు నుజ్జునుజ్జై.. పలువురు అక్కడికక్కడే మృతి
బస్సు ఢీకొట్టిన(TamilNadu Accident) రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో కరూరుకు చెందిన ప్రముఖ స్వర్ణాభరణాల వ్యాపారి రాజరత్నం (69), ఆయన భార్య రాజేశ్వరి (57), డ్రైవర్ జయకుమార్ ఉన్నారు.
విమానాశ్రయం నుంచి తిరిగొస్తూ విషాదం
మరో కారులో ప్రయాణిస్తున్న పుదుక్కోట్టైకి చెందిన ముబారక్, తాజ్ బిర్కా, సిరాజుద్దీన్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సిరాజుద్దీన్ తన బంధువును కెనడా పంపేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ప్రమాద సమాచారం అందగానే పోలీసులు, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి, గంటల పాటు వాహనాలు ముందుకు కదలలేదు.
వరుస ప్రమాదాలపై ఆందోళన
తమిళనాడులో ఇటీవల హైవేలపై తరచుగా జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు, క్రమం తప్పకుండా నిర్వహణ జరగకపోవడమే టైరు పేలుడు వంటి ఘటనలకు కారణమవుతున్నాయని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: