2026 తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్థాపించిన ‘మక్కళ్ నీది మయ్యం’ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా టార్చిలైట్ గుర్తును కేటాయించింది. గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుతో కమల్ హాసన్ పార్టీ పోటీ చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also: Seed Act : కొత్త విత్తన చట్టంతో కొత్త కష్టాలు!
TVK పార్టీకి ‘విజిల్’ గుర్తు
ఇదే సమయంలో తమిళ (Tamil Nadu) సినీ పరిశ్రమలో మరో అగ్ర నటుడు విజయ్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీకి కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. TVK పార్టీకి ‘విజిల్’ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుపైనే TVK అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ‘బిగిల్’ సినిమాతో ఈ గుర్తుకు ఉన్న అనుబంధం ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లవచ్చని పార్టీ భావిస్తోంది. ఈ కేటాయింపుతో TVK పార్టీ తన తొలి ఎన్నికల సమరానికి సిద్ధమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: