(Tamil Nadu) బరువు తగ్గాలనే ఆశతో సరైన వైద్య సూచనలు లేకుండా యూట్యూబ్ వీడియోల్లో(YouTube) చెప్పిన నాటు మందులను వినియోగించడం ప్రాణాంతకంగా మారింది. వేంగారం (బోరాక్స్) వంటి రసాయన పదార్థాలు మానవ శరీరానికి అత్యంత హానికరమైనవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆహారంగా లేదా ఔషధంగా వాడితే జీర్ణక్రియ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, కిడ్నీలు, కాలేయం వంటి ముఖ్య అవయవాలు విఫలమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
(Tamil Nadu) వైద్యుల పర్యవేక్షణ లేకుండా తీసుకునే ఇలాంటి పదార్థాల వల్ల మొదట వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించి, పరిస్థితి విషమిస్తే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ముఖ్యంగా యువత త్వరగా ఫలితం రావాలనే ఆశతో ఇలాంటి షార్ట్‌కట్ మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Budget 2026: కుదేలవుతున్న వ్యవసాయ రంగాన్ని బడ్జెట్ ఆదుకునేనా?
తాజా గా యూట్యూబ్‌లో చూసిన నాటు మందుల వీడియోను నమ్మి నాటు మందును తీసుకున్న ఓ యువతి మృతి చెందిన ఘటన తమిళనాడులో(Tamil Nadu) చోటుచేసుకుంది. మధురై మీనాంబల్పురానికి చెందిన కలైయరసి (19) బరువు తగ్గాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్‌లో సూచించిన వేంగారం (బోరాక్స్) అనే రసాయన పదార్థాన్ని కొనుగోలు చేసి సేవించింది. దీంతో తీవ్ర వాంతులు, విరేచనాలు రావడంతో ఆస్పత్రులకు తరలించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: