తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం సంక్రాంతి (పొంగల్) పండుగను పురస్కరించుకుని రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త చెప్పింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పండుగ కానుకను అందించనుంది. ప్రతి రేషన్ కార్డుదారుడికి రూ.3,000 నగదు సహాయంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్‌ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
Read Also: Chhattisgarh: చదువు ఒత్తిడి తట్టుకోలేక.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.
ప్రభుత్వ సాయం
(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ జనవరి రెండో వారంలో ఈ పంపిణీని ప్రారంభిస్తారు. జనవరి తొలి వారంలో టోకెన్ల పంపిణీ జరుగుతుంది. గిఫ్ట్ హ్యాంపర్‌లో ముడి బియ్యం, చక్కెర, చెరుకు, ధోతీ, చీర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు ఉంటాయి. గత ఏడాది కేవలం గిఫ్ట్ హ్యాంపర్ మాత్రమే అందించగా, ఈసారి నగదు సహాయంతో ప్రభుత్వ సాయం గణనీయంగా పెరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: