Tamil Nadu: రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Read Time:  1 min
Tamil Nadu: రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
FONT SIZE
GET APP
Tamil Nadu: రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Tamil Nadu: RTC bus hits biker crossing road

Tamil Nadu: తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా కౌండప్పడి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. హైవేపై రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వేగంగా డ్రైవర్ బస్సు నడపడం, అజాగ్రత్తగా రోడ్డు దాటిన బైకర్.. ఇద్దరి తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Bill Gates: బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

ప్రమాదం ఎలా జరిగింది?

సీసీ ఫుటేజ్ ప్రకారం బైకర్ హైవేపై ట్రాఫిక్ పరిస్థితిని సరిగా అంచనా వేయకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అధిక వేగంతో వస్తున్న బస్సు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేక ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

రోడ్డు భద్రతపై హెచ్చరిక

హైవేపై రోడ్డు దాటేటప్పుడు పాదచారులు, బైకర్లు అత్యంత జాగ్రత్త వహించాలని, అలాగే డ్రైవర్లు వేగ పరిమితులను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.