📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Mayonnaise : స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్ తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

Author Icon By Sudheer
Updated: April 25, 2025 • 8:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్ట్రీట్ ఫుడ్ అభిమానులకు తమిళనాడు ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యువతను ఆకట్టుకునే మయోనైజ్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. మయోనైజ్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని, ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిషేధం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం

మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, ప్యాకేజింగ్, విక్రయాల్లో గల లోపాల వల్ల క్రిములు, బ్యాక్టీరియా పెరుగుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కారణంగా మయోనైజ్ వాడకంతో ఫుడ్ పాయిజన్, ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నట్లు గుర్తించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఈ నిషేధం విధించినట్లు పేర్కొంది.

తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం అమల్లో

ఇప్పటికే తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం అమల్లో ఉంది. ఇప్పుడు తమిళనాడు కూడా అదే దారిలో ముందుకెళ్లింది. ఈ నిర్ణయం ఫాస్ట్ ఫుడ్ బిజినెస్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రభుత్వానికి ప్రాధాన్యమని పేర్కొంది. ప్రజలు మయోనైజ్ వినియోగాన్ని మానుకోవాలని, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు అవలంబించాలని అధికారులు సూచిస్తున్నారు.

banned tamil nadu Google News in Telugu mayonnaise

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.