📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Tamil Nadu Crime: ఎంతకు తెగించారురా.. భీమా డబ్బు కోసం తండ్రిని హతమార్చిన కుమారులు

Author Icon By Tejaswini Y
Updated: December 20, 2025 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు(Tamil Nadu Crime)లో మానవత్వాన్ని కలచివేసే ఓ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రిని హత్య చేయించి, అది పాము కాటు వల్ల జరిగిన ప్రమాదంగా చూపించేందుకు ఇద్దరు కుమారులు చేసిన కుట్ర బయటపడింది. సుమారు రూ.3 కోట్ల బీమా సొమ్ము కోసమే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా క్లెయిమ్ ప్రక్రియలో అధికారులకు అనుమానం కలగడంతో ఈ నేరం వెలుగుచూసింది.

 Read Also: HYD: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

కుమారుల క్రూరత్వం బయటపడ్డ తీరు

పోలీసుల వివరాల ప్రకారం, తిరువళ్లూరు జిల్లాకు చెందిన గణేశన్ (56) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గత అక్టోబర్‌లో ఆయన పాము కాటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంత్యక్రియలు(funeral) పూర్తైన కొద్ది రోజులకే, గణేశన్ పేరిట ఉన్న బీమా పాలసీలకు సంబంధించిన రూ.3 కోట్ల క్లెయిమ్ కోసం ఆయన ఇద్దరు కుమారులు బీమా సంస్థను సంప్రదించారు.

Tamil Nadu Crime

అయితే, గణేశన్ పేరిట అసాధారణంగా అధిక మొత్తంలో బీమా పాలసీలు(Insurance policies) ఉండటం, అలాగే క్లెయిమ్ కోరుతూ వచ్చిన కుమారుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో బీమా సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు కేసును లోతుగా విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముందే పథకం వేసుకుని తండ్రిని హత్య చేయించినట్లు తేలింది.

నిద్రలో ఉన్న తండ్రిపై పాము కాటు

విచారణలో నిందితులు మరో సంచలన విషయం వెల్లడించారు. హత్యకు వారం రోజుల ముందు కూడా ఓసారి ప్రయత్నించి విఫలమైనట్లు ఒప్పుకున్నారు. ఆ తర్వాత అత్యంత విషపూరితమైన పామును తెచ్చి, నిద్రలో ఉన్న తండ్రి మెడపై కాటు వేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనను ప్రమాదంగా చూపించేందుకు పామును అక్కడికక్కడే చంపేశారు. అంతేకాదు, కావాలనే ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో ఇద్దరు కుమారులతో పాటు వారికి సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

father murder case Insurance Fraud shocking crime news Snake Bite Murder Tamil Nadu crime Tiruvallur District

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.