ఇటీవల బాంబుల బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. ఆమధ్యకాలంలో ఢిల్లీలో స్కూళ్లల్లో బాంబులు(Bombs) పెట్టినట్లు వరుస ఈమెయిల్ రావడంతో పోలీసులు, అధికారులు హుటాహుటిగా విద్యార్థులను బయటకుపంపి తనిఖీలు చేశారు.
తర్వాత ఇవన్నీ ఫేక్ న్యూస్(Fake news) అయ్యాయి. విమానాసంస్థలు కూడా తరచూ ఇదే సమస్యను ఎదుర్కొంది. విమానం బయలుదేరేసమయంలో బంబులు పెట్టినట్లు సమాచారం రావడం, వాటిని ఆపీ తనిఖీలు చేయడం వల్ల విమాన సంస్థలకు కోట్లల్లో నష్టం వచ్చింది. వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈమధ్య సెలబ్రిటీలు, మంత్రుల ఇళ్లలో బాంబులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో మంత్రి ఇంట్లో బాంబు పెట్టినట్లుగా సమాచారం వచ్చింది.
Read Also: Two Wheelers: ఇకపై కొత్త ద్విచక్ర వాహనాలకు ఏబీఎస్ తప్పనిసరి.
తనిఖీలు చేసిన సిటీ పోలీసులు
తమిళనాడు(Tamil Nadu) మంత్రులు కె.ఎన్.నెహ్రూ,(K.N. Nehru) అన్బిల్ మహేష్ పొయ్యమోళి నివాసాలలో బాంబులు పెట్టినట్లు బెదిరిస్తూ సిటీ పోలీసులకు ఉదయం ఒక ఇమెయిల్ వచ్చింది. దీంతో తిల్లై నగర్, అన్నా నగర్ లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఇంట్లో వంట గది నుంచి అన్ని ప్రాంతాలను కూడ అధికారులు తనిఖీలు చేశారు. చివరకు వాహనాలు కూడా తనిఖీలు చేయగా.. ఎలాంటి అనుమానస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపుల సమయంలో ఇద్దరు మంత్రులు కూడా లేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: