ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ Amir Khan Muttaqi ముత్తాఖీ వారం రోజుల పాటు భారత్ పర్యటనలో ఉన్నారు. తాలిబన్ Taliban ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, భారత్‌కి ఆయన రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించే దిశగా కీలకమని భావిస్తున్నప్పటికీ, జెండా ప్రోటోకాల్ అంశం భారత అధికారులకు ఒక పెద్ద దౌత్య చిక్కుగా మారింది. దౌత్య నియమాల ప్రకారం, అధికారిక సమావేశాల్లో ఇరుదేశాల జాతీయ పతాకాలను ప్రదర్శించడం ఆనవాయితీ. కానీ, భారత్ Bharat ఇప్పటివరకు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. అందువల్ల, వారి జెండాకు గుర్తింపు లేదు. అదే సమయంలో, కేవలం భారత జెండా మాత్రమే ఉంచడం కూడా అంతర్జాతీయ దౌత్య శైలిలో తగదు.
Modi: భారత్-యూకేల మధ్య పలు అంశాలపై ఒప్పందం
Taliban minister on India visit.
తాలిబన్
ఇదే సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తలపట్టుకుంటున్నారు. ఢిల్లీలోని ఆఫ్ఘన్ దౌత్య కార్యాలయంలో ఇంకా పాత అష్రఫ్ ఘనీ ప్రభుత్వ జెండానే ఉపయోగిస్తున్నారు. కొత్త ప్రభుత్వాన్ని గుర్తించని భారత వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే, సమావేశాల సమయంలో ఏ జెండాను ఉంచాలో అనే ప్రశ్న ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. గతంలో దుబాయ్ Dubai లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ముత్తాఖీని కలిసినప్పుడు జెండాలు లేకుండా సమావేశం నిర్వహించి సమస్యను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. కానీ ఈసారి సమావేశాలు భారత రాజధానిలో జరుగుతుండటంతో, అదే ఫార్ములా అమలు చేయడం అంత తేలిక కాదు. తాలిబన్ Taliban పాలనను భారత్ ఇప్పటికీ గుర్తించకపోయినా, వాణిజ్యం, మానవతా సహాయం, భద్రతా అంశాలపై మితమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘన్ నేల ఉగ్రవాదానికి కేంద్రంగా మారకూడదన్నది భారత్ స్పష్టమైన అభిప్రాయం. ఈ నేపథ్యంలో ముత్తాఖీ పర్యటనతో ఇరుదేశాల సంబంధాలు కొత్త దిశగా పయనించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: