ఉత్తర భారతంలో పొగమంచు తీవ్రత పెరిగి పలు నగరాలను కమ్మేసింది. ఉదయకాలంలో కొన్ని ప్రాంతాల్లో దూరం కేవలం రెండు మూడు అడుగుల వరకు కనిపించన స్థితి నెలకొంది. ఆగ్రాలోని తాజ్ మహల్(Taj Mahal)ను సందర్శించిన పర్యాటకులు పొగమంచు కారణంగా దాని అందాలను చూడలేకపోగా, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఉదయపు పొగమంచు వల్ల ఫోటోలు దిగకపోవడం.. టూరిస్టుల అసహనం
శనివారం ఉదయం పొగమంచులో మసీదు వెనుక దృశ్యాన్ని పర్యాటకులు వీడియో ద్వారా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో తెల్లటి పొగమంచు మినహా, తాజ్ మహల్ స్ఫుటంగా కనిపించడంలేదని చూపించబడింది. నెటిజన్లు దీనిని చూసి తాజ్ మహల్ ఎక్కడుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజ్ మహల్ ముందు సెల్ఫీలు, ఫోటోలు తీయాలనుకున్న పర్యాటకులకు కేవలం తెల్లటి పొగమంచే కనిపిస్తోంది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యమవడం, అలాగే పర్యాటకులకు స్పష్టమైన దృశ్యం లభించకపోవడం గైడ్లు మరియు స్థానిక వ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే కొన్ని రోజులపాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సరిగ్గా చూడాలనుకునే పర్యాటకులు వాతావరణ పరిస్థితులను పరిశీలించి వచ్చేందుకు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: