📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Tahawwur Rana : ముంబై దాడుల్లో నా పాత్ర లేదు… తహవ్వూర్ రాణా

Author Icon By Divya Vani M
Updated: April 26, 2025 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2008లో ముంబైను కుదిపేసిన 26/11 ఉగ్రదాడి కుట్రలో తనకు ఎలాంటి సంబంధం లేదని తహవ్వుర్ రాణా స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను, ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం సుదీర్ఘంగా విచారించింది.సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ విచారణలో రాణా చాలా విషయాలు వెల్లడి చేశాడు. 166 మంది అమాయకుల ప్రాణాలను తీసిన దాడిలో తన పాత్ర ఏమాత్రం లేదని తేల్చిచెప్పాడు. దాడులకు గానీ, ప్రణాళికలకు గానీ తాను జవాబుదారిని కాదని రాణా తెలిపినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు.తన చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ మాత్రమే రెక్కీ నిర్వహించి, దాడులకు మౌలికం వేసినట్లు రాణా ఆరోపించాడు. లష్కరే తోయిబా తరఫున హెడ్లీ ముంబై సహా భారత్‌లో అనేక ప్రదేశాల్లో రెక్కీ చేసినట్టు ఇంతకుముందు అంగీకరించాడు కూడా.విచారణలో రాణా కొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. ముంబై, ఢిల్లీతో పాటు కేరళను కూడా సందర్శించినట్లు తెలిపాడు.

Tahawwur Rana ముంబై దాడుల్లో నా పాత్ర లేదు… తహవ్వూర్ రాణా

కేరళ పర్యటనపై దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా, ఓ పరిచితుడిని కలవడమే లక్ష్యమని చెప్పాడు. ఆ వ్యక్తి పేరు, చిరునామా వంటి వివరాలను కూడా అధికారులకు అందించాడు. దీంతో రాణా చెప్పిన విషయాలను నిర్ధారించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ త్వరలో కేరళ పర్యటనకు సిద్ధమవుతోంది.అయితే, విచారణలో రాణా పూర్తిగా సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. తరచూ పల్లపు సమాధానాలు ఇచ్చి, స్పష్టత ఇవ్వకుండానే తప్పించుకునే ప్రయత్నం చేశాడట. చాలా సంవత్సరాల క్రితం జరిగిన దాడికి సంబంధించి స్పష్టమైన జ్ఞాపకాలేమీ లేవంటూ జ్ఞాపకశక్తి లోపాన్ని చూపించినట్లు సమాచారం.ప్రస్తుతం ఎన్ఐఏ ముంబై దాడులకు ముందు లష్కరే తోయిబా మరియు పాకిస్థాన్ ఐఎస్ఐ కలిసి రాచిన కుట్రపై విస్తృత దర్యాప్తు జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే రాణాను విచారిస్తున్నారు.తహవ్వుర్ రాణాకు అబ్దుర్ రెహ్మాన్ హషీమ్ సయ్యద్, సాజిద్ మజీద్, ఇలియాస్ కశ్మీరీ, జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ లాంటి కీలక ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న అనుమానాలపై కూడా విచారణ సాగుతోంది. పాకిస్థాన్ ఆర్మీ మెడికల్ కోర్‌లో మాజీ అధికారిగా పనిచేసిన రాణాను, అమెరికా నుంచి ప్రత్యేకంగా భారత్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

Read Also : LOC tensions : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసీ వద్ద పెరిగిన ఉద్రిక్తత

2611Attack DavidHeadley LashkarETaiba MumbaiTerrorAttack NIAInvestigation PakistanArmy TahawwurRana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.