📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Tahawwur Hussain Rana : 26/11 దాడుల తర్వాత హెడ్లీతో చెప్పిన రాణా

Author Icon By Divya Vani M
Updated: April 11, 2025 • 8:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2008 ముంబై ఉగ్రదాడుల్లో కీలకంగా ముద్ర వేసిన తహవ్వుర్ హుస్సేన్ రాణా (64)ను ఎట్టకేలకు భారత్‌కు అప్పగించారు దాదాపు 20 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రాణా భారత్‌కు రావడం గొప్ప విజయం. అమెరికా నుంచి గురువారం ప్రత్యేక విమానంలో రాణా ఢిల్లీ చేరాడు తహవ్వుర్ రాణా పాకిస్తాన్ ఆర్మీలో వైద్యాధికారిగా పనిచేశాడు. తర్వాత కెనడాలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్‌గా స్థిరపడ్డాడు బాల్యమిత్రుడు డేవిడ్ హెడ్లీకి సహకరించి ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి.2008 నవంబర్‌లో జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు వీటికి లష్కరే తోయిబా, హుజీ ఉగ్రవాద సంస్థలు బాధ్యత వహించాయి. రాణా వీటి తో కుమ్మక్కై కుట్రకు తోడ్పడ్డాడు దాడుల అనంతరం, “ఇది భారతీయులకు జరగాల్సిందే” అని రాణా హెడ్లీకి అన్నాడట.

Tahawwur Hussain Rana 26 11 దాడుల తర్వాత హెడ్లీతో చెప్పిన రాణా

దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ పురస్కారం ఇవ్వాలంటూ సైతం ప్రశంసల వర్షం కురిపించాడని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.డేవిడ్ హెడ్లీ ఇప్పటికే అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు అతనికి పూర్తి స్థాయిలో సహకరించిన రాణా విచారణ కీలకంగా మారింది. ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. రాణాను ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా, 18 రోజుల కస్టడీ మంజూరైంది.హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా స్పందిస్తూ… రాణా అప్పగింత 26/11 బాధితులకు న్యాయం కలగజేసే తొలి అడుగుగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ మాజీ రాయబారి మార్క్ సోఫర్ భారత్‌ ప్రయత్నాలను ప్రశంసించారు. ఎన్ఐఏ భావిస్తున్నది ఏంటంటే… రాణా నోటి నుంచి అసలైన కుట్ర కారులు ఎవరన్నదీ బయటపడే అవకాశం ఉంది 26/11 వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠాలను ఈ విచారణ ద్వారా వెలికితీయవచ్చని నమ్మకంగా ఉన్నారు.

26/11 Mumbai Attacks David Headley India US Extradition Lashkar-e-Taiba Mumbai terror attacks NIA Investigation Tahawwur Rana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.