Biryani orders India : ప్రతి నిమిషం 194 బిర్యానీలు.. స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్!

Read Time:  1 min
Biryani side effects
Biryani side effects
FONT SIZE
GET APP

Biryani orders India : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన 10వ వార్షిక నివేదిక ‘హౌ ఇండియా స్విగ్గీడ్ 2025’ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, భారతీయుల ఆహార అభిరుచుల్లో బిర్యానీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా పదో ఏడాది కూడా దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకంగా బిర్యానీ నిలిచింది.

2025లో దేశవ్యాప్తంగా ఏకంగా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ సంఖ్యలను గమనిస్తే, సగటున ప్రతి నిమిషానికి 194 బిర్యానీలు, అంటే ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ డెలివరీ అయినట్టు స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో చికెన్ బిర్యానీ 5.77 కోట్ల ఆర్డర్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Read also: Actor Sivaji Says Sorry For Comments: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన శివాజీ

టాప్ ఫుడ్ ఐటమ్స్

బిర్యానీ తర్వాత భారతీయులు ఎక్కువగా ఇష్టపడిన ఫుడ్ (Biryani orders India) ఐటమ్ బర్గర్. ఈ ఏడాది మొత్తం 4.42 కోట్ల బర్గర్ ఆర్డర్లు వచ్చాయి. మూడో స్థానంలో పిజ్జా (4.01 కోట్లు), నాలుగో స్థానంలో వెజ్ దోశ (2.62 కోట్లు) నిలిచాయి. అల్పాహారాల్లో ఇడ్లీ (1.1 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా, మసాలా దోశ రెండో స్థానాన్ని దక్కించుకుంది.

రాత్రి 12 నుంచి ఉదయం 2 గంటల మధ్య చికెన్ బర్గర్లు, బిర్యానీలకు భారీ డిమాండ్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్‌లో నిలవగా, బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో 3,196 సార్లు ఫుడ్ ఆర్డర్ చేసి రికార్డు సృష్టించారు. స్వీట్స్ విభాగంలో గులాబ్ జామున్, చాక్లెట్ కేకులు అత్యధికంగా ఆర్డర్ చేయబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.