Supreme Court verdict: మహిళల భద్రత, గౌరవానికి సంబంధించి దేశవ్యాప్తంగా కీలక ప్రభావం చూపే తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. దుస్తులను పట్టుకుని లాగడం, ఆడవారి ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడం అత్యాచార నేరం కిందకు రాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, దుస్తులు లాగడం కూడా అత్యాచార యత్నమేనని స్పష్టం చేసింది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read Also: AI Summit: ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
సుమోటో అంటే ఏమిటి?
అంటే ఎవరు పిటిషన్ వేయకపోయినా, కోర్టు లేదా అధికారి తనంతట తానే ఒక విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవడాన్ని సుమోటో అంటారు.
సుమోటో పిటిషన్, సాధారణ పిటిషన్ మధ్య తేడా ఏమిటి?
సాధారణ పిటిషన్: బాధితుడు లేదా వ్యక్తి కోర్టును ఆశ్రయిస్తాడు.
సుమోటో: కోర్టే స్వయంగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: