📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Supreme Court: ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Author Icon By Anusha
Updated: July 21, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనేక విషయాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రత్యర్థుల ఆర్థిక వనరులపై వరుసదాడులకు పాల్పడుతూ, అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.ప్రత్యేకంగా ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ, వ్యాపారవేత్తల ఆర్థిక వనరులపై ఈడీ తరచూ దాడులకు దిగుతూ,విమర్శలకు గురవుతున్నది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈడీ పనితీరుపై తీవ్ర వాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటంచేయడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.పోరాటాలు చేయడానికి ప్రయత్నించినందుకు ఈడీపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా మండిపడింది. ముడా కుంభకోణం సమా మరోకేసులో విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈడీపై తీవ్ర వ్యాఖ్యల్ని చేసింది. దీనికి సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటక సీఎం భార్య భూమి విషయంలో వివాదం,రాజకీయమైసూరు సమీపంలోని కెసరె గ్రామంలో కర్ణాటక సిద్ధరామయ్య సతీమణి పార్వతికి మూడు ఎకరాల భూమి ఉంది.

చట్టపరమైన చర్యల ద్వారా

ఆభూమిని ఆమె తన సోదరుడు మల్లికార్జునస్వామికి 2010లో బహుమతిగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా,ముడా ఆ భూమిని స్వాధీనం చేసుకుని, పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగులప్లాట్లను ఇచ్చింది. కెసరెలోని భూమితో పోలిస్తే విజయనగరంలో ల్యాండ్ మార్కెట్ ధర చాలా ఎక్కువగా. ఈ కుంభకోణం,మొత్తం విలువ రూ.3,000-4,000 కోట్ల వరకు ఉంటుంది అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ క్రమంలో,సిద్ధిరామయ్య భార్య పార్వతికి ఈడీ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను కర్ణాటక హైకోర్ట్ సింగిల్బెంచ్ జడ్జి జస్టిస్ఎం.నాగప్రసన్న క్వాషం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా ఈడీకి,ఎదురు దెబ్బ తగిలింది. దర్యాప్తు సంస్థపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court: ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

కోర్టు బయటే రాజకీయ యుద్ధాలు

మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణానికి సంబంధించిన కేసులో కర్ణాటక సిఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, రాష్ట్ర మంత్రి సురేష్లపై జారీ చేసిన సమన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ, ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను సుప్రింకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai),జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ఈడీపై మండిపడింది. రాజకీయ యుద్దాలు కోర్టు బయటచేసుకోవాలని తెలిపింది. అసలు ఈ పోరాటలకు ఈడీని ఎందుకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి లోపం లేదని తేల్చిచెప్పింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తికి జీతం ఎంత?

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి నెలవారీ జీతం రూ. 2,50,000.
అయితే, పదవీ విరమణ చేసిన తర్వాత వారికి సంవత్సరానికి సుమారు రూ. 15 లక్షల పెన్షన్ (Dearness Reliefతో కలిపి) లభిస్తుంది.అలాగే, రూ. 20 లక్షల గ్రాచ్యుటీ (Gratuity) కూడా అందుతుంది.

భారతదేశపు మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు?

భారత సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of India) హరిలాల్ జయంతీలాల్ కానియా (Harilal J. Kania) గారు 1950, జనవరి 28న పదవీ బాధ్యతలు చేపట్టారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also: Robot Teacher: దేశంలోనే మొదటిసారి కేరళలో రోబో టీచర్

Breaking News ED criticism ED political misuse ED raids Enforcement Directorate controversy Karnataka CM wife land issue latest news opposition leaders raids SC slams ED Supreme Court on ED Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.