పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ’ (ఎస్ ఐఆర్) ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తగిన ఆధారాలు లభిస్తే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ గడువును పొడిగించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించగలమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Read also : PM Modi: 18 ఏళ్ల యువతను బలోపేతం చేద్దాం
లక్షలాది మంది అర్హులైన ఓటర్లు జాబితా
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ, తమిళనాడులోని (Tamil Nadu) డీఎంకే తదితర పార్టీలు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్ ఐఆర్ ప్రక్రియ రాజ్యాంగ చెల్లుబాటు, సమయపాలనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తక్కువ సమయంలో వర్షాలు, పండుగ సీజన్ల మధ్య ఈ సవరణ చేపట్టడం వల్ల లక్షలాది మంది అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న ఇలాంటి పిటిషన్లపై తదుపరి విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఈసీఐకి రెండు వారాల గడువు ఇచ్చి, ఈ అంశంపై వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. న్యాయం కోసం గట్టి ఆధారాలు చూగలిగితే, ముసాయిదా జాబితాల ప్రచురణ తేదీని పొడిగించాలని ఆదేశించడంలో వెనుకాడబోమని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబరు 9కి వాయిదా వేసింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :