📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Supreme Court: కరూర్ తొక్కిసలాట ఘటన పై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశాలు

Author Icon By Anusha
Updated: October 13, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ కేసు విచారణ బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, సీబీఐ దర్యాప్తు (CBI investigation) ను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది.

Bira-91-loss : Bira 91 రూ.748 కోట్ల నష్టంలో – ఒక చిన్న పేరు మార్పే భారీ దెబ్బ!

జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో పాటు, బీజేపీ తమిళనాడు నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం ప్రకటించింది.

Supreme Court

అక్టోబర్ 10న ఈ పిటిషన్లపై వాదనలు ముగియగా, ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.తమిళనాడు పోలీసుల ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగే అవకాశం లేదని టీవీకే పార్టీ తన పిటిషన్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం రాష్ట్ర పోలీసు అధికారులతోనే హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) ఏర్పాటు చేయడాన్ని పిటిషన్‌లో తప్పుబట్టింది.

ఏదైనా కుట్ర కోణం ఉండే అవకాశం ఉందని

ఈ దుర్ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఘటన అనంతరం విజయ్, ఆయన పార్టీ నేతలు పశ్చాత్తాపం చూపలేదని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా టీవీకే (TVK Party) తన పిటిషన్‌లో ప్రస్తావించింది.కాగా, సెప్టెంబర్ 27న జరిగిన ఈ సభకు 10,000 మంది వస్తారని అంచనా వేయగా,

ఊహించిన దానికంటే మూడు రెట్లు అధికంగా దాదాపు 27,000 మంది హాజరయ్యారని పోలీసులు గతంలో తెలిపారు. నటుడు విజయ్ (Vijay) సభా ప్రాంగణానికి ఏడు గంటలు ఆలస్యంగా చేరుకోవడమే ఈ విషాదానికి ఒక కారణమని వారు పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు పూర్తిగా సీబీఐ చేతికి వెళ్ళింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News cbi investigation Karur stampede case latest news Supreme Court India Telugu News Vijay TVK

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.