ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది.
42 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటూ అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవన్నారు. నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం, పదేపదే వాయిదాలు కోరుతుండటం జాప్యానికి మరో కారణమని నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. క్రిమినల్ కేసులు ఉంటే ఉద్యోగంలో చేరేందుకు అనర్హులని, అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు అవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అనంతరం కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.అనంతరం కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ను మర్చి 4 తేదికి వాయిదా వేసింది.
కొన్ని ముఖ్యమైన అంశాలు:–
ఎన్నికల విధానాలపై సుప్రీంకోర్టు సమీక్ష:
ఎన్నికలు నిర్వహించే విధానం, నిబంధనలు, నియమాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా అనేది సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు, విధానాలు వివాదాస్పదంగా మారితే, సుప్రీంకోర్టు వాటిపై నోటీసులు జారీ చేయవచ్చు.
ప్రారంభ తీర్పులు:
సుప్రీంకోర్టు కొన్ని సందర్భాలలో తాత్కాలిక ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. ఉదాహరణకు, ఒక అభ్యర్థి అభ్యర్థనను అంగీకరించడం లేదా ఎన్నికల నిర్వహణలో ఏదైనా విభజన ఉంటే, తక్షణ చర్య తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్‌కి నోటీసులు జారీ చేస్తుంది.
నిర్భయ ఎన్నికలు:
సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్‌ని జరీ చేసే నోటీసుల వెనుక ముఖ్య ఉద్దేశ్యం “నిర్భయ” ఎన్నికలు నిర్వహించడమే. ఇది ప్రజల హక్కులను పరిరక్షించడానికి, స్వేచ్ఛగా, ఇష్టం వున్నట్లుగా ఓటు వేసేందుకు అవకాశమిచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తుంది.