📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Supreme Court – Shami: క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

Author Icon By Anusha
Updated: February 19, 2026 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Supreme Court – Shami: భారత క్రికెటర్ మహమ్మద్ షమీకి సంబంధించిన గృహహింస, భరణం కేసుల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు షమీకి నోటీసులు జారీ చేసింది. కోల్‌కత్తాలో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలంటూ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో కోర్టు విచారణల కోసం పశ్చిమబెంగాల్‌కు తరచుగా వెళ్లడం తనకు కష్టంగా మారుతోందని ఆమె వెల్లడించారు.

Read Also: T20 WC 2026: వెస్టిండీస్‌ తో మ్యాచ్.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇటలీ

ఎలాంటి అసౌకర్యం ఉండదు

మహ్మద్ షమీ వృత్తిరీత్యా ప్రొఫెషనల్ క్రికెటర్ కావడంతో మ్యాచ్‌ల కోసం దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తుంటాడని, అందువల్ల కేసును దిల్లీకి మార్చినా అతనికి ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అదనంగా, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న షమీ కుటుంబ నివాస ప్రాంతం కోల్‌కతాతో పోలిస్తే దిల్లీకి భౌగోళికంగా సమీపంలో ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.ఈ కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని కేసును దేశ రాజధానికి బదిలీ చేస్తే కోర్టు విచారణలకు హాజరు కావడం తనకు సులభమవుతుందని ఆమె వాదించారు.

Supreme Court notice to cricketer Mohammed Shami

దీనిపై స్పందించాలని సుప్రీంకోర్టు షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా ఇటీవల తనకు, తన కూతురి నెలవారి జీవనాధారానికి ఇచ్చే భరణాన్ని రూ.4 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని హసిన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మహ్మద్ షమీ,హసిన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2015లో కుమార్తె జన్మించింది.అనంతరం 2018లో షమీపై గృహహింస ఆరోపణలు చేస్తూ హసిన్ జహాన్ ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదు ఆధారంగా షమీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

HasinJahan latest news Supreme Court - Shami Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.