📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Supreme Court: వరకట్న మరణాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Aanusha
Updated: November 29, 2025 • 8:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరకట్నం, వివాహ వ్యవస్థపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి కఠిన వ్యాఖ్యలు చేసింది.ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థ వరకట్నంతో కమర్షియల్ అంశంగా మారిపోయిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పరస్పర విశ్వాసం, సహవాసం, నమ్మకం, గౌరవాలపై నిర్మితమైన ఈ ఆదర్శ వ్యవస్థ ఇటీవలి కాలంలో వాణిజ్య లావాదేవీగా మారిపోవడం విచారకరమని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌. ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం పేర్కొంది.

Read Also: Social Media: సోషల్ మీడియా యాప్‌లకు కేంద్రం కొత్త నిబంధనలు

పెళ్లైన నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్తకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఆక్షేపించింది. భర్త విపరీత పోకడ, నేర తీవ్రత, బాధితురాలి వాంగ్మూలాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని మండిపడింది.ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. ‘‘వరకట్న మరణం కేవలం ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా సమాజం మొత్తంపై జరిగిన నేరం.

స్వచ్ఛంద కానుకలు, బహుమతుల పేరుతో ఇచ్చే వరకట్నం సామాజిక హోదాను ప్రదర్శించుకునే ప్రయత్నం.. వస్తు వ్యామోహాన్ని తృప్తిపరిచే తాపత్రయం. వరకట్నం సామాజిక దురాచారం. వివాహ పవిత్రతను ఇది భ్రష్టుపట్టించి, మహిళల్ని అణచివేతకు గురిచేస్తోంది. మరింత క్రూరంగా మారి నవ వధువుల అకాల మరణానికి కారణమవుతుంది.

Supreme Court makes strong comments on dowry deaths

గొంతెమ్మ కోరికలు తీర్చలేని కారణంతో

కేవలం వ్యక్తిగత విషాదమే కాదు.. సమాజ ఉమ్మడి అంతరాత్మకు అవమానం.ఎటువంటి తప్పు చేయకున్నా గొంతెమ్మ కోరికలు తీర్చలేని ఒకే ఒక్క కారణంతో అత్తింటిలో కోడలి జీవితం బలైపోతోంది.. మానవ గౌరవ మూలాలపై ఇది ఘోరమైన నేరం. సమానత్వం, గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించే రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 21 కల్పించిన హక్కులను ఇది హరిస్తోంది.

సమాజ కూర్పును క్షీణింపజేసి, నాగరిక సమాజ పునాదుల్ని బలహీనపరుస్తోంది. న్యాయవ్యవస్థ ఇలాంటివాటిని ఉపేక్షించి వదిలిపెడితే నేరాలు చేసేవారికి ధైర్యం ఇచ్చినట్టువుతుంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలించినట్లవుతుంది.. కాబట్టి చట్టం నమ్మకం,

గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయవ్యవస్థ స్పందన బలంగా ఉండాలి.ఈ కేసులో న్యాయంతో పాటు వరకట్న దురాచారాలను చట్టం, సమాజం అంగీకరించవని నిర్ద్వంద్వంగా సందేశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆందోళనకర రీతిలో వరకట్న మరణాలు పెరుగుతున్న తరుణంలో న్యాయసమీక్ష కఠినంగా ఉండాలి. నేరాలకు పాల్పడినవారిని స్వేచ్ఛగా వదిలేస్తే సెక్షన్ 304బీ, 498ఏ లక్ష్యమే నీరుగారిపోతుంది’’ అని వ్యాఖ్యానించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

BV Nagarathna comments dowry crime judgment dowry system India latest news R Mahadevan bench Supreme Court India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.