📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Supreme Court: పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం సూచనలు

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దర్యాప్తులో భాగంగా తప్పనిసరి అని భావించినపుడు ముందస్తుగా నోటీసు జారీ చేశాక అరెస్టు చేయాలని పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) సూచించింది. భారత న్యాయ సంహిత ప్రకారం నోటీసులు జారీ చేసినప్పటికి అరెస్టు తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సతేందర్ కుమార్ అంటిల్ వర్సెస్ సీబీఐ కేసులో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కే సింగ్ ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛతో కూడుకున్న విషయం కాబట్టి అరెస్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు సూచించింది.

Read Also: TG: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

పౌరులకు కల్పించిన హక్కుల ఉల్లంఘన జరగకుండా జాగ్రత్తపడాలి

క్రిమినల్ కేసుల్లో ఫిర్యాదు అందిన తర్వాత రెండు దశల పద్ధతిని పాటించాలని దర్యాప్తు అధికారికి కోర్టు (Supreme Court) సూచించింది. సదరు కేసు విచారణలో అరెస్టు తప్పనిసరా? కాదా?.. బీఎన్ఎస్ సెక్షన్ 33, సెక్షన్ 35 ప్రకారం అరెస్టు చెయ్యవచ్చా? లేదా? అనేది వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియలో ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు) ప్రకారం పౌరులకు కల్పించిన హక్కుల ఉల్లంఘన జరగకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించింది.

Supreme Court instructions to police

ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని; నిందితుడు, సహ నిందితుడనే భేదాలు ఏవీ మినహాయింపు కాదని స్పష్టం చేసింది. అదే సమయంలో అరెస్టుకు సంబంధించి పోలీసులకు చట్టం కల్పించిన మినహాయింపులనూ సుప్రీంకోర్టు ప్రస్తావించింది. బీఎన్ఎస్ సెక్షన్ 35(1)(బి) ప్రకారం.. ఎలాంటి వారెంట్ లేకున్నా పోలీసులు అరెస్టు చేయవచ్చనే నిబంధనను ప్రస్తావిస్తూ.. ఈ రూల్ ప్రకారం వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని భావించరాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Police arrest guidelines Supreme Court of India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.