📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Supreme Court: వృద్ధాప్యంలో ఉన్న మమ్మని చూసుకోకపోతే  గెంటేయొచ్చు.

Author Icon By Sushmitha
Updated: September 25, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వృద్ధాప్యంలో(old age) ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులు అనుభవించే హక్కు ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలను బయటకు కూడా వెళ్లగొట్టవచ్చని స్పష్టం చేసింది. బిడ్డలు పట్టించుకోని తల్లిదండ్రులకు 2007లో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం అండగా ఉంటుందని కోర్టు పేర్కొంది.

West Indies series: వెస్టిండీస్‌ సిరీస్ కు భారత జట్టు ఇదే!

మహారాష్ట్ర కేసు, తీర్పు వివరాలు

మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ దంపతులు తమ కొడుకు సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్(Petition) వేశారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పును వెలువరించింది. గతంలో కూడా కోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చిందని గుర్తుచేసింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత కొడుకులు, కూతుర్లదేనని స్పష్టం చేసింది. వారిని పట్టించుకోకుంటే ఆస్తి పొందే హక్కు ఉండదని హెచ్చరించింది.

మధ్యప్రదేశ్ కేసు, ట్రైబ్యునళ్లకు అధికారం

గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన వృద్ధ దంపతులు తమ కొడుకు బాగోగులు చూసుకుంటానని మాట తప్పాడని సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ కొడుకుకి ఇచ్చిన ఆస్తిని రద్దు చేసి, దానిపై ఆ దంపతులకే హక్కును పునరుద్ధరించింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు,(Tribunals,) కన్నవారిని పట్టించుకోని పిల్లల విషయంలో వెంటనే దర్యాప్తు జరుపుతాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై మళ్లీ యాజమాన్య హక్కులు పొందేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు ఆస్తిపై హక్కు ఉంటుందా?

ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఏ చట్టం తల్లిదండ్రులకు అండగా ఉంటుంది?

2007లో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Elderly Care Google News in Telugu India. Latest News in Telugu legal judgment parents rights property law Supreme Court Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.