దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల (Movie theaters) లో టికెట్ ధరలతో పాటు తినుబండారాల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిపై సుప్రీంకోర్టు (Supreme Court) కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి పై భారం రోజురోజుకీ పెరుగుతోందని, టికెట్‌తో పాటు పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరలు సాధారణ ప్రజలకు అందనంతగా మారిపోయాయని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: Users: రీఛార్జ్ లు తగ్గించాలని AIRTEL, JIO లకు నెటిజన్లు విజ్ఞప్తి
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం (Government of Karnataka) సినిమా టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
“ఇప్పటికే సినిమాకి వెళ్ళాలంటే కనీసం ₹1,500 నుంచి ₹2,000 వరకు ఖర్చవుతోంది. ఒక కుటుంబం సినిమా చూడాలంటే అది భారంగా మారింది. థియేటర్లలో ఫుడ్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగితే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది” అని ఆందోళన వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: