సమాజంలో ఒక గుర్తింపు, హోదా రాగానే తాము గొప్పవారమని భావిస్తారు. తాము ఏదీ మాట్లాడినా సరైందే అనుకుంటారు. అవి కాస్త వివాదాస్పదంగా మారిపోతాయి. చివరికి కోర్టులు చివాట్లు పెట్టేంతవరకు వెళ్తాయి. అంతేకాదు కోర్టులు కొన్నిసార్లు శిక్షలు కూడా ఇస్తాయి. ప్రముఖ హాస్యనటుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స ర్ సమయ్ రైనా విషయం కూడా ఇలాంటిదే జరిగింది. ఇటీవల కాలంలో సమయ్ రైనా సోషల్ మీడియాలో (Social media) అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. వికలాంగులను ఎగతాళి చేసినందుకు పరిణామాలను ఎదుర్కొంటున్నారు. కోర్టు చివాట్లు పెట్టేంతవరకు తమ తప్పుకు పర్యవసానం ఎంత నష్టాన్ని ఇస్తుందో గ్రహిస్తారు.
Read Also: Ranveer Allahbadia: ఆన్‌లైన్ కంటెంట్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వీడియోలన్నీ తొలగింపుకు కోర్టు ఆదేశం ఇడియాస్ గాట్ టాలెంట్ షో భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే యూట్యూబర్ రణవీర్ అలహాబాద్లోడియా పాల్గొన్న ఆ షో చివరి ఎపిసోడ్ లో దివ్యాంగులపై అవమానకరమైన, అభ్యంతకరమైన వ్యాఖ్య చేశారు. దీనితో సమయ్ రైనా, రణవీర్ అలహాబాద్లోడియా, ఇతర హాస్యనటులపై ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యింది. సమయ్ రైనా తన షో నటుండి అన్నీ వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాల్సి వచ్చింది.
క్షమాపణలు చెప్పినా తప్పని శిక్ష
అయితే తర్వాత సమయ్ రైనా క్షమాపణలు చెప్పాడు. అయితే సుప్రీంకోర్టు (Supreme Court) మాత్రం వీడియోలను సోసల్ మీడియా నుండి తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు వికలాంగుల కోసం నిధుల సేకరణ కార్యక్రమాలను నెలకు కనీసం రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది. తద్వారా వచ్చే ఆదాయాన్ని వికలాంగులకు, వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడానికి ఉపయోగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సమయ్ రైనాతోపాటు మరో నలుగురు హాస్యనటులకు ఈ ఆదేశాలు కోర్టు జరీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: