📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Supreme Court: 16 ఏళ్లకు లైంగిక సమ్మతి పై సుప్రీంలో వాదనలు

Author Icon By Anusha
Updated: August 8, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియాలో లైంగిక సమ్మతికి సంబంధించిన వయోపరిమితి అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో స్పష్టమైన వైఖరి ప్రకటించింది. ప్రస్తుతం 18 సంవత్సరాలుగా ఉన్న లైంగిక సమ్మతి వయస్సును తగ్గించాలన్న ప్రతిపాదనను కేంద్రం కొట్టిపారేసింది. 18 ఏళ్ల లోపు ఉన్న వారిని లైంగిక మోసాలు, లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు.. ఈ 18 ఏళ్ల వయోపరిమితిని తీసుకువచ్చి.. కఠినంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. లైంగిక సమ్మతి వయసును తగ్గిస్తే.. అది తీవ్ర అనర్థాలకు దారి తీస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే 18 ఏళ్లు దాటిన వారే లైంగిక చర్యకు సమ్మతి తెలిపేందుకు అర్హులు అనే నిబంధనను.. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) లో కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఇందులో వయో పరిమితిని తగ్గించడం కుదరదని తేల్చి చెప్పేసింది. లైంగిక సమ్మతి వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలంటూ సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సుప్రీంకోర్టులో చేసిన వాదనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది.

లిఖిత పూర్వక సమాధానాన్ని సుప్రీంకోర్టుకు

ఈ వాదనకు స్పందనగా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి లిఖిత పూర్వక సమాధానాన్ని సుప్రీంకోర్టుకు అందజేశారు. సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఇతర లైంగిక దాడుల (Sexual assault) నుంచి.. 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లను కాపాడేందుకే లైంగిక సమ్మతి వయసును చట్టపరంగా 18 ఏళ్లుగా నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కౌమార దశలో ఉన్న యువతీ యువకుల మధ్య లైంగిక సంబంధిత ప్రేమ పేరుతో ఈ వయోపరిమితిని 2 ఏళ్లు తగ్గించడం అనేది చట్టపరంగా వ్యతిరేకమే కాకుండా అది సమాజానికి కూడా ప్రమాదకరమని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి సుప్రీంకోర్టుకు వెల్లడించారు.

Supreme Court:

వయోపరిమితిని తగ్గించడం

18 ఏళ్ల లోపు పిల్లల మౌనాన్ని, వారి ఎమోషన్స్‌ను ఆసరాగా చేసుకుని.. వారిపై లైంగిక దాడులకు పాల్పడే వారిని.. ఈ నిబంధన అడ్డుకుంటుందని.. ఒకవేళ వారు దాన్ని పట్టించుకోకుండా లైంగిక దాడులకు పాల్పడితే చట్టప్రకారంగా కఠిన శిక్షలు విధిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వయోపరిమితిని తగ్గించడం వల్ల.. దాన్ని ఆసరాగా చేసుకుని పిల్లలను అక్రమంగా రవాణా చేయడం, బాలలపై జరిగే నేరాలు విపరీతంగా పెరిగిపోతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉన్న మైనర్లను రక్షించడమే తమ ప్రభుత్వానికి కీలకమని.. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని తేల్చి చెప్పింది.

కృషి నీరుగారిపోతుందని

లైంగిక వేధింపుల నుంచి మైనర్లను కాపాడేందుకు ఈ 18 ఏళ్ల వయోపరిమితి చాలా ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం వాదించింది. దీన్ని దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ లైంగిక సమ్మతి వయసును తగ్గిస్తే.. దేశంలో బాలల రక్షణ కోసం గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కృషి నీరుగారిపోతుందని.. పోక్సో వంటి కఠిన చట్టాలు తీసుకురావడంలో అర్థం లేదని వెల్లడించింది. 18 ఏళ్ల లోపు వారికి లైంగిక సమ్మతిపై సరైన అవగాహన, పరిణతి ఉండవని పేర్కొన్న కేంద్రం.. దాన్ని తగ్గిస్తే వారికి పెను ముప్పుగా మారుతుందని కేంద్రం వివరించింది.

భారత సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది?

భారత సుప్రీంకోర్టు 1950, జనవరి 28న స్థాపించబడింది.

సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది?

భారత సుప్రీంకోర్టు న్యూఢిల్లీ లో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rakhi-festival-do-you-know-the-importance-of-rakhi-what-is-the-real-story-behind-it/breaking-news/527757/

18 years legal age Aishwarya Bhati statement Breaking News Central government response Indian Supreme Court Indira Jaising petition latest news Sexual consent age

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.