📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

NEET PG 2025 : నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు ఆమోదం

Author Icon By Sudha
Updated: June 6, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నీట్‌-పీజీ-2025 (NEET PG 2025) పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఆమోదం తెలిపింది.

NEET PG 2025 : నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు ఆమోదం


సమయం కావాలి
జూన్‌ 15వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో జరపడానికి పర్మీషన్ కోరుతూ ఎన్‌బీఈ ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్‌బీఈఎంఎస్‌ అభ్యర్థనను తిరస్కరించింది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించడానికి నిరాకరించింది. దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. అందుకే ఒకే షిఫ్ట్‌లో పరీక్షను ముగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పరీక్ష ఒకే షిఫ్టులో జరపడానికి మరింత సమయం కావాలని బోర్డు కోరింది. ఈ క్రమంలో ఈ నెల 15న జరగవలసిన నీట్‌-పీజీ, 2025ను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌బీఈఎంఎస్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒకేషిఫ్టులో
మే 30న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు తమ టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) లిమిటెడ్‌ సాధ్యమైనంత త్వరగా పరీక్షను నిర్వహించడానికి అనువైన తేదీగా ఆగస్టు 3ని నిర్ణయించిందని, ఈ తేదీన పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్‌బీఈ సుప్రీంకోర్టును కోరింది. రెండు షిఫ్టుల్లో కాకుండా ఒకేషిఫ్టులో పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా జూన్‌ 15న నిర్వహించాల్సిన నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్‌బీఈ తెలిపింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 3వ తేదీన పరీక్ష జరపడానికి అవకాశం కల్పించింది. నీట్‌ పీజీ-2025 పరీక్ష ద్వారా ఎంఎస్‌ కోర్సులో 12,690, ఎండీ కోర్సులోని 24,360, పీజీ డిప్లొమా కోర్సులోని 922 సీట్లను భర్తీ చేయనున్నారు.

Read Also: Rekha Gupta: ఎట్టకేలకు అధికార నివాసం పొందిన రేఖా గుప్తా:

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu NEET PG exam Paper Telugu News Supreme Court approves Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.